Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ పై పవన్ అదిరిపోయే ప్లాన్-కచ్చితంగా వర్కవుట్-అదనుచూసి ప్రయోగిస్తున్న వైనం

ఏపీలో వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టడంలో రెండేళ్లుగా విఫలమవుతున్న జనసేన పార్టీకి ఇప్పుడు సరైన అవకాశం దొరికింది. ఇప్పటివరకూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై పలు విమర్శలు చేస్తున్నా కార్యాచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు ఓ కీలక అంశంపై సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు భారీ ప్లాన్ రచించింది. కత్తిలా రెండు వైపులా పదునున్న ఈ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం జనసేనకు కచ్చితంగా భారీ మైలేజ్ దక్కబోతోంది. అదీ అదను చూసి ప్రయోగిస్తుండటం పవన్ కళ్యాణ్ పార్టీకి కచ్చితంగా ఉపయోగపడే విషయం.

 వైసీపీ వర్సెస్ జనసేన

వైసీపీ వర్సెస్ జనసేన

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన పోరు ఇప్పటిది కాదు. గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జత కట్టిన జనసేన పార్టీ.. అప్పుడు వైసీపీని దారుణంగా దెబ్బతీసింది. జనసేన ప్రభావంతో వైసీపీ విజయానికి ఆమడ దూరంలో నిలిచిపోగా.. కీలక సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ భారీగా లబ్ది పొందింది. ఆ తర్వాత రాజధాని అమరావతితో పాటు పలు అంశాల్లో టీడీపీకి అండగా నిలిచిన జనసేన.. వైసీపీని ఆ మేరకు ఇరుకునపెడుతూ వచ్చింది. అయితే 2019 నాటికి మారిన పరిస్ధితుల్లో తొలిసారి అభ్యర్ధులను బరిలోకి దించిన జనసేన.. దారుణ పరాజయాలు చవిచూసినా ఇప్పటికీ వైసీపీకి జనసేన ప్రభావంపై కచ్చితమైన అంచనాలే ఉన్నాయి.

అభివృద్ధి గాలికొదిలేసిన వైసీపీ సర్కార్

అభివృద్ధి గాలికొదిలేసిన వైసీపీ సర్కార్


ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ప్రజాకర్షక పథకాలతో కాలం గడిపేస్తోంది. ఎన్నికల్లో పనికొచ్చేవి ఇవే తప్ప అభివృద్ధి కాదని ఓ అంచనాకు వచ్చేసింది. దీంతో అభివృద్ధి, పెట్టుబడులు, భవిష్యత్తు అనే అంశాలపై దృష్టిసారించడం మానేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత దారుణ స్ధాయికి మౌలిక సదుపాయాలు చేరిపోయాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఇసుక సంక్షోభంతో పాటు పలు అంశాలపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన జనసేన పార్టీ ఇప్పుడు అభివృద్ధి విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది.

 ఏపీలో రోడ్ల దుస్ధితి

ఏపీలో రోడ్ల దుస్ధితి

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ భారీ ఎత్తున సంక్షేమాన్ని అందించే క్రమంలో అభివృద్దిని దాదాపుగా మర్చిపోయింది. అభివృద్ధికి కనీస ఆనవాళ్లుగా కనిపించే రోడ్లను సైతం పట్టించుకోవడం మానేసింది. రోజూ ఏదో ఒక సంక్షేమ పథకానికి డబ్పులు విడుదల చేస్తూ కనిపిస్తున్న సీఎం జగన్.. రోడ్ల విషయానికి వచ్చే సరికి మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు ఛిద్రమైపోయాయని తెలుస్తున్నా.. వాటి విషయంలో మాత్రం భారీగా నిధులు మాత్రం కేటాయించడం లేదు. ఇచ్చిన అవి కచ్చితంగా రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు చేరతాయో లేదో తెలియదు. దీంతో రోడ్లు ఇప్పట్లో బాగుపడే సూచనలు లేవని సామాన్య జనం సైతం ఫిక్స్ అయిపోయారు.

జనసేన పోరు బాట

జనసేన పోరు బాట

ఏపీలో రోడ్ల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతున్న పరిస్ధితుల్లో ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకపోవడంతో విపక్షంలో ఉన్న జనసేన ఈ వ్యవహారంపై పోరాటం చేయాలని నిర్ణయించింది. దెబ్బతిన్న రోడ్లపై ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆందోళనలు నిర్వహిస్తున్న జనసేన నేతల్ని పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రోడ్లపై పోరును కొత్త పుంతలు తొక్కించాలని జనసేన పార్టీ నిర్ణయించుకుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రోడ్ల ఫొటోల్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా దద్దరిల్లేలా చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీంతో జనసేన శ్రేణులు ఈ దిశగా కదులుతున్నాయి.

జగన్ బాటలోనే దెబ్బకు దెబ్బ

2014 ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీకి సోషల్ మీడియా బలం తెలిసొచ్చింది. అంతే ఆ తర్వాత సోషల్ మీడియాపై పూర్తిగా దృష్టిపెట్టింది. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా పబ్లిక్ యాప్స్ లోనూ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. టీడీపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ వాడుకున్న సోషల్ మీడియా ప్లాన్ ను ఇప్పుడు జనసేన తమ ఆయుధంగా ఎంచుకోబోతోంది. ఏపీలో రోడ్ల దుస్దితిపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేయాలంటే గతంలో ప్రత్యర్దులపై వైసీపీ వాడిన ప్లాన్ నే తిరిగి వారిపై ప్రయోగించాలని నిర్ణయించింది. అందుకే రోడ్లపై జనసైనికుల్ని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వాన్ని.. సోషల్ మీడియాలో ఓ ఆటాడుకోవాలని జనసేన భావిస్తోంది.

అదను చూసి దెబ్బతీస్తున్న పవన్ ?

ఏపీలో రోడ్ల దుస్ధితిపై ప్రత్యక్ష ఆందోళనలతో పాటు సోషల్ మీడియా వార్ ను పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం కొత్త రోడ్లు వేయడానికి లేదా, పాత రోడ్ల రిపేర్లకు డబ్బు కేటాయించే పరిస్దితి లేదు. అదే సమయంలో డబ్బులు ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లతో రోడ్లు వేయించే పరిస్దితి లేదు. ఎందుకంటే వారికి గతంలో వేసిన రోడ్ల డబ్బులే ఇంకా ఇవ్వలేదు. దీంతో కొత్త రోడ్లకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అలాగే పాత రోడ్లకు రిపేర్ల టెండర్లకు సైతం ముందుకు రావట్లేదు. దీంతో ఇదే సరైన సమయంగా జనసేనాని పవన్ భావించారు. రోడ్లకు డబ్బులివ్వలేక, ఇచ్చినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాక ఇబ్బందులు పడుతున్న జగన్ సర్కార్ ను దెబ్బతీసేందుకు ఇదే మంచి తరుణంగా పవన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే సరైన సమయంలో రంగంలోకి దిగి సోషల్ మీడియా వార్ ప్రకటించడం ద్వారా ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇరుకునపెట్టేందుకు జనసైనికులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పవన్ వ్యూహం ఈసారి కచ్చితంగా వర్కవుట్ అయ్యేలాగే కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+