జగన్ కు ఛాలెంజ్ విసురుతున్న పవన్ కల్యాణ్?

ప్రజల్లో భావోద్వేగాలను తట్టి లేపడంద్వారా మూడురాజధానులు తమకు రెండోసారి అధికారాన్ని కట్టబెడతాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వానికి దమ్ముంటే మూడు రాజధనులపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం కూడా మూడు రాజధానులే అజెండగా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. జనసేనకానీ, టీడీపీ కానీ అమరావతి ఒకటే రాజధాని అని స్పష్టం చేస్తున్నాయి.

మూడు రాజధానులే వైసీపీ ప్రధాన అస్త్రం

మూడు రాజధానులే వైసీపీ ప్రధాన అస్త్రం

ప్రజల్లో భావోద్వేగాలను తట్టి లేపడంద్వారా మూడురాజధానులు తమకు రెండోసారి అధికారాన్నికట్టబెడతాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఏ అజెండామీద వైసీపీ వెళుతుంది అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తమ పార్టీ విశాఖపట్నం, కర్నూలు, అమరావతి మూడు రాజధానులుగానే ఎన్నికల ప్రచారానికి ప్రధాన అస్త్రంగా మలచుకోబోతున్నామని పార్టీ నాయకులు వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నం రాజధానిని అంగీకరించారని చెబుతున్నారు.

అమరావతిపై 23న స్పష్టత

అమరావతిపై 23న స్పష్టత

అమరావతి రాజధాని విషయం సుప్రీంకోర్టులో ఈనెల 23వ తేదీన ఒక స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించినప్పుడు, ప్రాంతాలవారీగా పర్యటించినప్పుడు మూడు రాజధానులపై ప్రజల్లో సానుకూలత ఏదీ లేదనేది పవన్ కల్యాణ్ అభిప్రాయంగా ఉంది. అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న వైసీపీపైనే ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అభిప్రాయంగా ఉంది. అందుకే వారు బహిరంగంగా మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసురుతున్నారు.

ఉగాదికి విశాఖ వెళ్లాలని..

మూడు రాజధానులు అనేవి అసందర్భమైనవనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడిందని, ప్రభుత్వమే మూడు రాజధానులనడంద్వారా అమరావతిని ఆలస్యం చేస్తోందని జనసేన అభిప్రాయం. ప్రజల్లో భావోద్వేగాలు లేనప్పుడు, అందరూ అమరావతికి అనుకూలంగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎలా వెళతారని మనోహర్ ప్రశ్నించారు.

జీ20 సదస్సు తర్వాత ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. అయితే సుప్రీంకోర్టులో 23వ తేదీన తీర్పు వచ్చేవరకు ఎదురుచూసి తీర్పునుబట్టి నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+