నా భార్య ఏడుస్తోంది, క్షమించమన్నా - వాలంటీర్లపై పవన్ కీలక నిర్ణయం..!!

జనసేనాని పవన్ మరోసారి వాలంటీర్ల పై కీలక వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొట్టి తీరుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని ఘాటు ఆరోపణలు చేసారు. వైసీపీ నేతల మాటలకు తన భార్య ఏడస్తోందని చెప్పుకొచ్చారు. సర్ది చెప్పి బయటకు వస్తున్నానని పవన పార్టీ నేతలతో చెప్పుకున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను తట్టి లేపుతున్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కీలక వ్యాఖ్యలు:వాలంటీర్ల పైన పవన్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ విషయంలో పవన్ తన వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం బయటకు వస్తున్నా..తన వలన మాటలు పడుతున్నందుకు క్షమించమని కోరానని పవన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పైన తీవ్ర ఆరోపణలు చేసారు. తన పైన కిరాయి మూకలను దింపుతారని..తన ప్రాణాలు పనంగా పెట్టి ప్రజలను తట్టి లేపుతున్నానని పేర్కొన్నారు. జగన్ నుంచి రాష్ట్రానికి రక్షణ కావాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతూ వాది వద్దే ఉందన్నారు.

Janasena Chief Pawan Kalyan decided to move for court against Volunteers,

వాలంటీర్లపై న్యాయపోరాటం:ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయచ్చు. సేవ చేయటానికి వచ్చిన వాలంటీర్ల వలన జరిగితే ఏం చేయగలమని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను న్యాయస్థానంలో జనసేన సవాల్ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ముక్కూ మొహం తెలియన వాలంటీర్లను తన బ్యాంకు ఖాతా వివరాలు ఎందుకు ఇవ్వాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వ్యవస్థలకు సమాంతర వ్యవస్థ అవసరం లేదని పేర్కొన్నారు. వాలంటీర్లు గురించి మాట్లాడగానే వాళ్లు ఆరు లక్షల మంది ఉన్నారని చాలా మంది భయపడుతున్నారని...వాళ్ల గురించి మాట్లాడటానికి ఎందుకు భయపడాలని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్ల వల్ల జరిగే నష్టాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

ప్రశ్నించే వ్యవస్థ ఏది:వాలంటీర్ల పై తనకు ద్వేషం లేదన్నారు. వారి పైన జనవాణిలో ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఆడపిల్లలను వేధిస్తున్నా ఏం చేయలేకపోతున్నామని తల్లితండ్రులు చెబుతున్నారని పవన్ వెల్లడించారు. తన వ్యాక్తిగత విషయాలపైన చర్చలు పెట్టే వైసీపీ నేతలు వేలాది మంది మిస్ అయితే స్పందించరా అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు పైన జగన్ ఊగిపోతూ మాట్లాడారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ఆరు కోట్ల మందిని నియంత్రించేందుకు వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని పవన్ ఆరోపించారు. వాలంటీరు వ్యవస్థ తప్పు చేస్తే నిలదీసే వ్యవస్థ ఏదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ తనను వ్యక్తిగతంగా దూషించాని పట్టించుకోవద్దని పార్టీ నేతలకు పవన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+