పిఠాపురంలో బాక్సులు బద్దలు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడా నెగ్గాలో చూపిస్తున్న పవన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్తియ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి అని చిన్నాపెద్దా అని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆ నియోజక వర్గం ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

అందుకు కారణం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చెయ్యడం, ఆ నియోజక వర్గంలో 86.63 శాతం ఓటింగ్ జరగడంతో కోట్లాది మంది తెలుగు ప్రజలు పిఠాపురం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పిఠాపురంలో మే 13వ తేదీన అర్దరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరి ఓటు వేశారు. అదే పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా పోటీ చెయ్యడంతో మహిళలు ఆమెకే ఓటు వేశారని వైసీపీ నాయకుల వాదన.

Janasena chief Pawan Kalyan is heading towards a huge majority in Pithapuram

వైసీపీ మీద విరక్తితో మహిళలు పవన్ కల్యాణ్ కు ఓటు వేశారని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ గెలుపు ఏ విధంగా ఉంటుంది అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేతగా, సినీనటుడిగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జేనసేన, బీజేపీ కూటమి ఏర్పడటానికి పవన్ కల్యాణ్ కీలకపాత్ర వహించారు.

అలాంటిది పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు ఎలా ఉంటుంది, ఎంత మెజారిటీ వస్తుందని అంటూ అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అత్యధిక సర్వే సంస్థలు పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపాయి. మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ అభ్యర్థి వంగా గీతా విజయం సాధిస్తారని చెప్పాయి. ఇలా సర్వే సంస్థలు పొంతన లేకుండా చెప్పడం కూడా పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో ఎవురు గెలుస్తారు అని టెన్షన్ మొదలైయ్యింది.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుస్తారా , వంగా గీతా గెలుస్తారా, ఎంత మెజారిటీ వస్తుంది అంటూ ఇప్పటికే జోరుగా బెట్టింగులు కూడా జరిగాయి. పిఠాపురంలోని కౌంటింగ్ కేంద్రాల ముందు ఇప్పటికే అందరికి టెన్షన్ మొదలైయింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ 60 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వర్మ ప్రకటించారు.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు చరిత్ర సృష్టిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని వర్మ ధీమాగా చెప్పారు. పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన నాయకుల విజయం నల్లేరుమీద నడకే అని జనసేన నాయకులు అంటున్నారు. ఈ నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ అనేకసార్లు తిరిగి జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు ఎంత మెజారిటీ వస్తుంది అనే విషయం ఈ రోజు కచ్చితంగా తెలిసిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+