Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టార్గెట్ 2019: ఆవనిగడ్డ నుండి పవన్ పోటీ, ఎందుకో తెలుసా?

Recommended Video

    అవనిగడ్డ నుంచి పోటీ చేయనున్న పవన్

    ఆవనిగడ్డ: కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే యోచనలో ఉన్నారని ఆ పార్టీ జిల్లా ఇంఛార్జీ ముత్తంశెట్టి కృష్ణారావు చెప్పారు.. అనంతపురం జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్టు ఇదివరకు ప్రకటించారు. అయితే ముత్తంశెట్టి కృష్ణారావు ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.

    2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవలనే ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో జనసేనను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

    కానీ, 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయమై పార్టీ నేతలతో చర్చించి త్వరలోనే ప్రకటించనున్నట్టు పవన్ తేల్చి చెప్పారు.ఈ మేరకు కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం తర్వాత ముత్తంశట్టి కృష్ణారావు మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు.

     ఆవనిగడ్డ నుండి పవన్ పోటీకి యోచన

    ఆవనిగడ్డ నుండి పవన్ పోటీకి యోచన

    కృష్ణా జిల్లా ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారని ఆ పార్టీ కృష్ణా జిల్లా ఇంఛార్జీ ముత్తంశెట్టి కృష్ణారావు చెప్పారు. ఆవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నట్టుగా ముత్తంశెట్టి కృష్ణారావు చెప్పారు. ఎన్నికల నాటికి పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఆవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే విషయమై ఆ పార్టీ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

    పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారు

    పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారు

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయమై తాజాగా ఆ పార్టీ నేత ముత్తం శెట్టి కృష్ణారావు చేసిన ప్రకటనతో చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అనంతపురం జిల్లాలోని ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ కూడ నిర్వహించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ తరుణంలో ఆవనిగడ్డ నుండి పోటీ చేస్తారనే ప్రకటన రావడంతో పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనంతపురంతో పాటు ఆవనిగడ్డ నుండి కూడ పోటీ చేస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. మరో వైపు తిరుపతి నుండి కూడ పవన్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ ఉంది.

    కోస్తాలో ప్రభావం చూపేనా

    కోస్తాలో ప్రభావం చూపేనా

    రాయలసీమలోని అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకొన్న నిర్ణయం రాజకీయంగా ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహించడం ద్వారా అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం దక్కుతోందనే అభిప్రాయం ఉండి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ తరుణంలో కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం కోస్తాపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

    రాజధాని కేంద్రంగా పవన్ ప్లాన్

    రాజధాని కేంద్రంగా పవన్ ప్లాన్

    అమరావతికి సమీపంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. రెండు మాసాల క్రితం పవన్ కళ్యాణ్ పార్టీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయం పూర్తైతే అక్కడి నుండే పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+