యువగళం సభకు పవన్ దూరం - కారణం ఇదేనా..!?
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ఈ రోజు టీడీపీ, జనసేన ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యాయి. లోకేష్ నిర్వహించిన యువగళం యాత్ర ముగింపు సభ భారీగా నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేసారు. ఈ సభలో చంద్రబాబు - పవన్ కలిసి పాల్గొనాలని నిర్ణయించటంతో అంచనాలు పెరిగాయి. కానీ, పవన్ కల్యాణ్ ఈ సభకు దూరంగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ సాయంత్రం విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చేలా నిర్ణయించారు. లోకేష్ నిర్వహించిన యువగళం యాత్ర ముగింపు సభను నవశకం సభగా నిర్వహిస్తున్నారు. ఈ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొనాలని నిర్ణయించారు.

తొలుత పవన్ ఈ సభకు హాజరు కానని సమాచారం ఇవ్వగా..చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి చర్చలు చేసిన తరువాత సభకు హాజరవుతన్నట్లు ప్రకటించారు. ఈ మధ్నాహ్నం షెడ్యూల్ ప్రకారం పవన్ విజయనగరం చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు చేరుకున్నారు. ఈ సభ ద్వారా ఇద్దరు నేతలు కీలక ప్రకటన చేస్తారని సంకేతాలు ఇచ్చారు.
కానీ, ఇప్పుడు పవన్ హాజరు పైన సందిగ్ధత కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం విమానంలో విశాఖ వెళ్లి..అక్కడ నుంచి విజయనగరం సభకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఆరోగ్య కారణాలతో పవన్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో పవన్ హాజరు పైన సందిగ్ధత కొనసాగుతోంది. పవన్ హాజరవుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాయలసీమ, ఉత్తరకోస్తా నుంచి విశాఖపట్నం నుంచి విజయనగరం కు ప్రత్యేక రైళ్లు చేరుకున్నాయి. గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు.












Click it and Unblock the Notifications