పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్- జనవాణి వారం వాయిదా-మళ్లీ ఎప్పుడంటే ?

జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్రతో పాటు జనవాణి టూర్ గా దీనికి నామకరణం కూడా చేశారు. ఐదు విడతలుగా జనవాణి టూర్ నిర్వహిస్తున్నారు. ఇందులో మూడు విడతల టూర్ కూడా పూర్తయింది. ఇప్పుడు వచ్చే వారం జరగాల్సిన నాలుగో విడత టూర్ వాయిదా పడింది.

తాజాగా గోదావరి జిల్లాల్లో వరద బాధితుల్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న అపారిశుద్ధ్య పరిస్ధితులతో పవన్ కు విషజ్వరం సోకింది. పవన్ తో పాటు ఆయన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు,నేతలకు కూడా విష జ్వరాలు సోకాయి. దీంతో తదుపరి జనవాణి కార్యక్రమంపై సందిగ్ఘత నెలకొంది. దీంతో జనసేన పార్టీ దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

janasena chief pawan kalyans next janavani tour postponed to july 31 due to viral fever

జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ఒక వారం వాయిదాపడిందని పార్టీ తరఫున కీలక నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం వైరల్ జ్వరానికి గురయ్యారని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షులతోపాటు కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు.

అందువల్ల వచ్చే ఆదివారం అంటే ఈ నెల 24 న కాకుండా 31వ తేదీన జనవాణి జరుగుతుందన్నారు. స్థలం, వేదిక వివరాలను త్వరలోనే తెలియచేస్తామన్నారు. ఇప్పటికే విజయవాడ, భీమవరంలలో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయ్యాయని, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+