ఏలూరు మృతులకూ కోటి ఎక్స్ గ్రేషియా-పవన్ కళ్యాణ్ డిమాండ్-ఎల్జీ పాలిమర్స్ కో న్యాయం...
ఏలూరు జిల్లా ముసునూరులోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. దీంతో స్పందించిన ప్రభుత్వం వారి కుటుంబాలకు ఫ్యాక్టరీ నుంచి రూ.25 లక్షల చొప్పున ఇప్పిస్తూ తాము మరో రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. ఇప్పుడు పోరస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకూ కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరస్ ఘటనపై పవన్ కళ్యాణ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో అగ్నిప్రమాద ఘటన విషాదకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయినట్లు పవన్ తెలిపారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

పోరస్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని పవన్ కోరారు. ముఖ్యంగా గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇచ్చినట్లుగా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు. ఒక్కో ప్రమాదానికీ ప్రభుత్వం ఒక్కో విధంగా పరిహారం ప్రకటించకూడదని పవన్ సూచించారు. ఇదే ఘటనలో 13 మంది ఆస్పత్రి పాలయ్యారని, వారికి మెరుగైన చికిత్సఅందించడంతో పాటు న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, భద్రతా ప్రమాణాల నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని పవన్ సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications