ఇది పొత్తు ధర్మం కాదు, చంద్రబాబుపై పవన్ సీరియస్ - టీడీపీకి వార్నింగ్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంలో బిగ్ ట్విస్ట్. టీడీపీ, జనసేన పొత్తులో భారీ కుదుపు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పైన జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ఏకపక్షంగా అభ్యర్దులను ప్రకటించటాన్ని తప్పు బట్టారు. టీడీపీకి కౌంటర్ గా తన పార్టీ అభ్యర్దులను ప్రకటించారు. గెలవటం కోసం పొత్తు కోరుకున్నానని చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో పొత్తు భవిష్యత్ పైన ఉత్కంఠ మోదలైంది.

కీలక పరిణామాలు : టీడీపీ, జనసేన పొత్తులో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు ఏం చెప్పినా మద్దతు ఇస్తూ వచ్చిన పవన్ ఒక్కసారిగా రూట్ మార్చారు. తాము పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు తమ అభ్యర్దులను ప్రకటించటాన్ని పవన్ తప్పు బట్టారు. చంద్రబాబుకు ఉన్నట్లే తన పార్టీ నుంచి తన పైన ఒత్తిడి ఉందన్నారు. మండపేట, అరకు అభ్యర్దులను తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లు రెండు సీట్లు ప్రకటించటంతో తాను రెండు సీట్లు ప్రకటన చేస్తున్నానని వెల్లడించారు. రాజానగరం, రాజోలు అభ్యర్దులను ప్రకటించారు.

Janasena Chief Pawan Kalyan Sensational comments on Alliance with TDP and Chandra Babu DEcisions

పొత్తు ధర్మం కాదు : పొత్తులో భాగంగా ఒక మాట అన్నా సర్దుకుపోతున్నామని పవన్ చెప్పుకొచ్చారు. లోకేష్ పవర్ షేరింగ్ గురించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. వేర్వేరుగా పోటీ చేస్తే సీట్లు వస్తాయేమో కానీ, అధికారం రాదని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ప్రకటన కారణంగానే తాను ప్రత్యేక పరిస్థితుల్లో సీటు ప్రకటిస్తున్నానని చెప్పుకొచ్చారు.

టీడీపీ, జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని తాను భావించానన్నారు. బలం ఇస్తున్న వాళ్లంగా మిలుగుతున్నామని..బలం తీసుకుంటున్న వాళ్లం కాలేకపోతున్నామని పవన్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల్లో తిరగనని అంటున్నారని..50-70 సీట్లు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారని చెప్పుకొచ్చారు. పొత్తుకు సిద్దమైన సమయంలోనే అన్నింటి పైన ఆలోచనలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు.

Janasena Chief Pawan Kalyan Sensational comments on Alliance with TDP and Chandra Babu DEcisions

పరోక్ష హెచ్చరిక : టీడీపీతో పొత్తుపైన నిర్ణయం సమయంలోనే అన్నీ తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు. ఏమీ తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాక్యలు చేసారు. దళితులకు సంబంధించి 22 పథకాలు తీసేసిన జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆక్షేపించారు. ఊరంతా శత్రువులు ఉన్న జగన్ కింద పని చేస్తున్న వైసీపీ నేతలు ఆలోచన చేసుకోవాలన్నారు. వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేసారు. తాజాగా పవన్ వ్యాఖ్యలు..సీట్ల ప్రకటన ద్వారా చంద్రబాబుకు పవన్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. సరైన విధానంలో ముందుకు వెళ్లకపోతే..ఏ నిర్ణయానికైనా సిద్దమనే సంకేతాలు పవన్ టీడీపీకి ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+