• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంలో స్వాతంత్రానికి గ్యారంటీ లేదు.. పాకిస్తాన్‌కే ఆ అవసరం.. పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్‘ స్పీచ్

|

''లక్షలాది మంది ఆత్మత్యాగాలు, బలిదానాలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. ఇండియాలో ప్రజాస్వామ్యం పర్మనెంట్‌గా ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. గతంలో జరిగినవి తల్చుకుంటే నాకిలా అనిపిస్తుంది. అందుకే ప్రతి తరం.. స్వాంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి పోరాడాలి. పూర్వీకుల మాదిరిగా మనం కూడా కష్టాలు, త్యాగాలకు సిద్ధంగా ఉండాలి''అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు.

హిందూ దేశంగా ప్రకటించలే..

హిందూ దేశంగా ప్రకటించలే..

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో పవన్ జాతీయ జెండా ఎగరేసి, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. వందలాది సంస్థానాల విలీనం ద్వారా 1950లో భారత్ గణతంత్ర రాజ్యాంగా ఏర్పడిందని, దీని వెనుక మన తాతల త్యాగం ఉందన్నారు. ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ విడిపోయినప్పుడు.. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మనది సెక్యులర్ విధానం కాబట్టి పెద్దలు ఆ పని చేయలేదని, మత రాజ్యాంగం ప్రకటించుకోవాల్సిన అవసరం పాకిస్తాన్‌కే ఏర్పడిందని పవన్ గుర్తుచేశారు.

జెండాకిచ్చే గౌరవం వేరుగా ఉండేది..

జెండాకిచ్చే గౌరవం వేరుగా ఉండేది..

ఇండియా సెక్యూలర్ దేశమని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని.. స్వాతంత్ర్యం తరువాత హిందూ దేశంగా ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమి జనసేనాని చెప్పారు. దేశంలో అన్నిమతాలు, అన్ని విశ్వాసాలకు సమాన గౌరవం ఉంటుందన్నారు. ఇలాంటి స్వాంత్ర్యం కోసం మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేశారో, విభజనతో ఎంత మంది నిరాశ్రయులయ్యారో గుర్తుచేసుకుంటే జాతీయ జెండాకు ఇచ్చే గౌరం వేరేలా ఉంటుందని పవన్ అన్నారు.

చట్టంలో కంటే గుండెల్లోనే పదిలం..

చట్టంలో కంటే గుండెల్లోనే పదిలం..

దేశంలోని మిగతా విశ్వాసాల్లాగే.. హిందూ ఇజం కూడా ఒక జీవన విధానమని, హిందూ మతాన్ని బలవంతంగా కట్టిపెట్టిన సందర్భాలు ఎక్కడా లేవని, అందుకే ఇండియాలో మాత్రమే ప్రజాస్వామ్యం సంపూర్ణంగా విలసిల్లుతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. సెక్యూలరిజానికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నప్పటికీ.. ప్రజల గుండెల్లోనూ ఆ భావన బలీయంగా, పదిలంగా ఉందన్నారు. కులం, మతం పట్టింపులు లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా స్పందించే గుణం భారతీయుల సొంతమన్నారు.

జర్మన్ ఫిలాసఫర్ ఏమన్నారంటే..

రిపబ్లిక్ డే ప్రసంగంలో పవన్.. ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త ఆర్థర్ స్కోపెన్హౌర్ మాటల్ని కోట్ చేశారు. యూరప్ లోని విలువల్ని ఇండియాలో ప్రవేశపెట్టడం.. కొండ శిఖరాన్ని తుపాకితో కొట్టడం లాంటిదని, ఇండియాలోని సంస్కృతి సంప్రదాయాలు విదేశీయుల్నే మర్చేస్తాయని ఆర్థర్ చెప్పిన విషయాన్ని జనసేనాని గుర్తుచేశారు. స్వాంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరం నిరంతరం పోరాడుదామని పిలుపునిచ్చారు.

English summary
janasena chief pawan kalyan sensational comments on republic day. after hoisting the national flag at his party office in Mangalagiri, pawan said, there is no guarantee of Independence and democracy, youth must continue fight for them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X