విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం మ‌ద్య‌పాన నిషేధం చేయ‌లేరు: ముద్దులు పెట్ట‌లేను..కేసీఆర్‌తో దోస్తీనా : జ‌గ‌న్‌పై ప‌వ‌న్ ఫైర్‌..

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. అమ‌లు కాని హామీలు ఇవ్వ‌టం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ మ‌ద్య‌పాన నిషేధ్ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో సంబంధాల పైన ప‌రోక్షంగా తీవ్రంగా స్పందించారు. జ‌న‌సేన ఓట‌మికి నాయ‌కులే కార‌ణ‌మ‌ని..ఎక్క‌డ త‌ప్పులు జ‌రిగాయో స‌రి చేసుకోవాల్సిన అవ స‌రం ఉంద‌న్నారు. దేశం మొత్తం మ‌న వైపు చూసేలా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో కొట్టుకోవ‌టం ఒక్క‌టే త‌క్కువ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్ చేసారు. గెలిచే వ‌ర‌కూ పోరాటం చేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు.

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు..

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు..

జ‌గ‌న్ పాల‌న‌కు వంద రోజుల స‌మ‌యం ఇస్తున్నామ‌ని చెప్పిన మ‌రుస‌టి రోజే ముఖ్య‌మంత్రి పైన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న పాల‌న పైన‌..ప‌రోక్షంగా ఆయ‌న వ్య‌వ‌హార శైలి పైనా ప‌వ‌న్ కామెంట్ చేసారు. త‌న‌కు ముద్దులు పెట్ట‌టం..త‌ల‌లు నిమ‌ర‌టం రాద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్ శైలిని ఎద్దేవా చేసారు. తాను ఏదైనా ఉన్న‌ది ఉన్న‌ట్లుగానే చెబుతాన‌ని వివ‌రించారు. అదే విధంగా ఏపీ ప్ర‌జ‌ల‌ను దూషించిన కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి లొంగాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌న్నారు. ఆంధ్రుల‌ను అవ‌మానించిన వారి వ‌ద్ద‌కు వెళ్లి ఆస్తుల కోస‌మే.. మ‌రో ర‌కంగా ప్ర‌యోజ‌నాల కోస‌మే తాను లాలూచీ ప‌డ‌లేనంటూ వ్యాఖ్యానించారు. మ‌నం భార‌త దేశంలో ఉన్నామ‌ని..మ‌న ప్రాంత హ‌క్కుల గురించి మాట్లాడే స్వేచ్చ మ‌న‌కు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో 2014లోనే మోదీ త‌న‌ను పిలిపించి..త‌న భోవేద్వేగం..ఆచ‌ర‌ణ న‌చ్చి బీజేపీతో క‌లిసి రావాల‌ని ఆహ్వానించార‌ని గుర్తు చేసారు.

అమ‌లు చేయ‌లేని హామీలు ఎందుకు

అమ‌లు చేయ‌లేని హామీలు ఎందుకు

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేని హామీలు ఎందుకు ఇచ్చార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు. సీఎం జగన్ చెప్తున్న ట్లుగా మద్యపాన నిషేధం చేయలేరన్నారు. అంచెలంచెలుగా నిషేధం కష్టం అని పేర్కొన్నారు. మెజార్టీ ప్రజల అభి ప్రాయం తెలుసుకోకుండా మద్యపాన నిషేధం కుదరదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అసెంబ్లీ నిర్వహణ తీరుపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల ప్రస్తావనే లేదన్నారు. ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఒక్కటే తక్కువని..ఒకరిని ఒకరు వేలు పెట్టి చూపించే స్థాయికి ఎదిగారని ప‌వ‌న్ విమ‌ర్శించారు. తిత్లీ తుఫానున వేళ జ‌గ‌న్ అక్క‌డే ఉన్నా..బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌లేద‌ని విమ‌ర్శించారు. పెన్ష‌న్ల‌ను మూడు వేలు చేస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌..ఏటా రూ.250 మాత్ర‌మే పెంచుతాన‌ని ముందే ఎందుకు చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించారు. తాము ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి పోరాటం చేస్తామ‌ని..పార్టీ కార్య‌క‌ర్త‌ల పైన దాడులు జ‌రిగితే తానే రోడ్డు మీద‌కు వ‌స్తాన‌ని హెచ్చ‌రించారు.

పార్టీ ఓడిపోవ‌టానికి అదే కార‌ణం..

పార్టీ ఓడిపోవ‌టానికి అదే కార‌ణం..

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమిపాలవడంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థత లేని నాయకుల వల్లే ఓడిపోయామని అన్నారు. తనకు స్వార్థం లేదని, ఉంటే 10 మందిని తీసుకెళ్లి ఏదైనా పార్టీతో కలిసేవాడినని వ్యాఖ్యానించారు. జనసేనతో గొడవ పెట్టుకున్నారు కాబట్టే టీడీపీ ఓడిపోయిందన్నారు. 2014లో పార్టీని కలపమని కొందరు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని పవన్ గుర్తుచేశారు. పార్టీ శ్రేణులు అంతా ప్ర‌జ‌ల పక్షాన నిల‌బ‌డాల ని పిలుపునిచ్చారు. దేశం మొత్తం మ‌న వైపు చూసేలా చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ నియెజ క‌వర్గ కార్య‌క‌ర్త‌లో స‌మావేశంలో మాట్లాడిన జ‌గ‌న్ వారికి అనేక సూచ‌న‌లు చేసారు.

English summary
Janasena Chief Pawan Kalyan serious comments on CM Jagan. Pawan says CM can not ban liquor in state. He questioned about relation with KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X