పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా తయారుచేయించారు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ఓ అభిమాని రూ.లక్ష ఖర్చుపెట్టి వెండిపూలతో దండ చేయించారు. అమలాపురం రూరల్ సమనస గ్రామానికి చెందిన అభిమాని వారాహి సభ సందర్భంగా పవన్ మెడలో వేయనున్నారు. కోనసీమ జిల్లాలో పవన్ "వారాహి" యాత్ర షెడ్యూల్ ఖరారైంది. 20వ తేదీ సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 21న ముమ్మిడివరంలో ఉదయం జనవాణి, సాయంత్రం సభ ఏర్పాటు చేస్తున్నారు. 22వ తేదీన అమలాపురంలో ఏర్పాటు చేయనున్న జనవాణి కార్యక్రమంతోపాటు అ23వ తేదీ సాయంత్రం అమలాపురంలో జరిగే బహిరంగసభలో పవన్ పాల్గొంటున్నారు.

ఈ సభ సందర్భంగానే సదరు వీరాభిమాని తయారుచేయించిన వెండిదండను వేసుకోనున్నారు. సభ అయిన తర్వాత 24వ తేదీన పి.గన్నవరం, రాజోలులో పర్యటిస్తారు. 25వ తేదీన రాజోలు, మలికీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడతారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు యువతను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారన్నారు. సమాజాన్ని, మనుషులకు కులాలవారీగా విడదీస్తున్నారని మండిపడ్డారు.

 pawankalyanvarahi

కులాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు ఎదుగుతున్నారని, బీసీ సామాజికవర్గానికి చెందిన గౌడ బిడ్డను చెరకు తోటలో నిర్దాక్షిణ్యంగా కాల్చేశారని, బీసీ నాయకులు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. కాపులకు అన్యాయం జరుగుతోంటే తోట త్రిమూర్తులు, కన్నబాబు ఏం చేస్తున్నారన్నారు. తాను ఏదైనా మాట్లాడితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు బాధపడతాడని, అతన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశామని, మా దురదృష్టమని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+