Janasena with TDP: నాదెండ్ల మనోహర్‌కు కీలక బాధ్యతలు, పవర్ షేరింగ్ అంటూ పవన్ కళ్యాణ్
గుంటూరు: వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడింది. టీడీపీతో పొత్తు ఖరారైన క్రమంలో ఆ పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున ఒక కమిటీని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని పవన్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా పనిచేసిన ఆయన అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందన్నారు పవన్.

మరోవైపు, జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు ఎలాంటి భేషజాలకు పోవద్దని సూచించారు. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువ కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు.
పదేళ్ల నుంచి మీరు అండగా ఉన్నారని పార్టీ శ్రేణులతో అన్నారు పవన్ కళ్యాణ్. కొంతమంది 2009 నుంచి ఎదురుచూస్తున్నారని.. అది 2024లో సాధిద్దామని అన్నారు. వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఎవరూ గొడవ పెట్టుకోవద్దని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు.
2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని పవన్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్‌పై మాట్లాడుతామన్నారు. ఎన్నికల్లో గెలిచాక రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర దశ, దిశ మారుస్తామని పవన్ వ్యాఖ్యానించారు.
కొందరు అధికారులు ఇకనైనా పద్దతి మార్చుకుని.. త్వరలో రాబోయే టీడీపీ, జనసేన.. బీజేపీ ఆశీస్సులతో ఏర్పడబోయే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిరోజులొచ్చాయన్నారు. రాష్ట్రానికి బలమైన భవిష్యత్ ఇవ్వబోతున్నామని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలోనే జగన్ కుట్ర చేశారని అన్నారు. విడతల వారీగా రాజీనామాలతో అభివృద్ధి జరగకుండా కుతంత్రం చేశారన్నారు. పేటీఎం కుట్రలను జన సైనికులు బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో విపరీతంగా వలసలు పెరిగాయన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications