చినకాకాని వద్ద ‘జనసేన’ ఏపీ కార్యాలయం, త్వరలో పవన్‌చే శంకుస్థాపన!
జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు: జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చినకాకాని దగ్గర మూడున్నర ఎకరాల భూమిని ఓ రైతు దగ్గర ఆ పార్టీ నాయకులు లీజుకు తీసుకున్నారు.
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ అంతర్గత నిర్మాణాన్ని ఆయా జిల్లాల్లో పూర్తి చేశారు.

ఇప్పుడు పార్టీ ఏపీ కార్యాలయాన్ని కూడా చినకాకానిలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే జనసేన ఏపీ కార్యాలయం భవన నిర్మాణానికి ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications