ఆంక్షల నడుమ జనసేన ఆవిర్భావసభ: 2024 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్; పవన్ ప్రసంగంపై ఉత్కంఠ!!
ఆంక్షల నడుమ జనసేన ఆవిర్భావసభ నేడు మచిలీపట్నంలో జరుగుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పవన్ ప్రసంగం చెయ్యనున్నారని, పొత్తులపై ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ పదవ వార్షిక ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. నేడు మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు మచిలీపట్నం చేరుకుంటున్నారు. ఈ సభ వేదికగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రకటించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని, సభా వేదికగా ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తారని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు? రాజకీయ వర్గాలలోనూ ఆసక్తి
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భారీగా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు రానున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గాచేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభవేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న ఆయన, ఇప్పటికే అవసరమైతే పొత్తులతో అయినా వైసీపీని ఓడించి తీరుతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టిడిపి తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు సభా వేదికగా ఏం చెప్పబోతున్నారు అన్నది అటు పార్టీ వర్గాలలోనే కాకుండా, రాజకీయ వర్గాలలోను ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఓడినా అలుపెరుగని శ్రామికుడిలా పవన్ కళ్యాణ్
2014లో మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఇంత కాలమైనా జనసేన పార్టీకి రాష్ట్రంలో రాజకీయాల మీద పట్టు దొరకలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలుపెరుగని శ్రామికుడిలా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి దారుణ ఓటమికి గురైనప్పటికీ మళ్లీ ఏపీ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పార్టీగా పవన్ కళ్యాణ్ పార్టీని చూపించే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల దెబ్బకు పవన్ కళ్యాణ్రాజకీయాలను వదిలేసిమళ్లీ సినిమాలకుపరిమితమవుతారు అని అంతా భావించిన వేళగెలిచినా ఓడినా ప్రజా క్షేత్రంలోనే ఉంటామని, ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెబుతూ పవన్కళ్యాణ్ పార్టీని ముందుకు నడుపుతున్నారు.
పోలీసుల ఆంక్షలు మధ్య పవన్ కళ్యాణ్ సభ
అయితే ఈసారి పవన్ కళ్యాణ్ సభ అడుగడుగునా పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగనుంది. దీంతో ఏమవుతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం బహిరంగ సభలకు కొన్ని కండిషన్లు పెట్టడంతో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సభకు కూడా కాస్త ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ పోలీసుల ఆంక్షలు లెక్కలోకి తీసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. 100 ఎకరాల్లో సభ పార్కింగ్ అన్ని పక్కాగా ఉండేలా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 35 ఎకరాలలో ఈ సభ స్థలి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా ఈ సభా వేదికకు పేరు పెట్టారు.

సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఇలా.. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే
అంతేకాదు సభా ప్రాంగణంలో 10 గ్యాలరీలు, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్దే ఓవైపు భోజన ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచారు. సభకు వచ్చిన వారు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని వసతులను కల్పించారు. సభకు వచ్చే వారికి అనారోగ్య సమస్య ఎదురైతే డాక్టర్లు, ఎనిమిది అంబులెన్స్ లను కూడా రెడీ చేశారు. ఇక ఈ సభలో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని ఆటోనగర్ నుండి మచిలీపట్నం బయలుదేరి వెళ్తారు. సాయంత్రం ఐదు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆపై రాత్రి 9 గంటల వరకు సభ జరుగుతుంది.

వచ్చే ఎన్నికల పొత్తులపై పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏమిటి? ప్రకటిస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా సంవత్సరం సమయం ఉంది. ఇక ఇప్పుడు సభా వేదికగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు. పొత్తులపై ఏం నిర్ణయం తీసుకుంటారు? టికెట్లను ఎవరికి ఇస్తారు? క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏమిటి? రాజధాని విషయంలో ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర అభివృద్ధిపై, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటి? ఏ అజెండాతో జనసేన వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతుంది? వంటి అంశాలకు ఈ సభ ద్వారా సమాధానం దొరుకుతుందని అందరూ భావిస్తున్నారు.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications