Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన పదవులకు కీలక నేత గుడ్ బై..! పవన్ కు లేఖ..!

జనసేన ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana)ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అన్ని పదవుల నుంచీ తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు తనను అన్ని పదవుల నుంచీ తప్పించాలంటూ అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వాజ్యమే ఇందుకు కారణం.

గతంలో అమరావతి రాజధానిలో పర్యావరణ ఉల్లంఘనలపై బొలిశెట్టి సత్యనారాయణపై తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ న్యాయం కోసం తన ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నానని ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖను కూడా జత చేశారు.

Janasena General Secretary Bolisetty Satyanarayana Urges Pawan Kalyan Relieve Me of Party Posts

​ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో తాను పిటిషనర్‌గా ఉన్నానని, ఈ నేపథ్యంలో తాను "నైతిక విరామం" తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న తన పాత్రల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరమన్నారు. ​ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే (NDA) ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటం, అలాగే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ​పరస్పర ప్రయోజనాల సంఘర్షణను (Conflict of Interest) నివారణ కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని నిర్ధారించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.

Janasena General Secretary Bolisetty Satyanarayana Urges Pawan Kalyan Relieve Me of Party Posts

ఇకపై ​పర్యావరణ పరిరక్షణపైనే తన దృష్టి అన్నారు. 'జల్ బిరాదరీ' నేషనల్ కన్వీనర్‌గా తన బాధ్యతలకు, "మన ముండి - మన నది" కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు. ​పార్టీ పదవి నుండి తాత్కాలిక విరామం మాత్రమే, రాజీనామా కాదన్నారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉందని తెలిపారు. జనసేన సిద్ధాంతాల పట్ల తన నిబద్ధత అచంచలమని, అయితే, పర్యావరణ న్యాయం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుత అధికార యంత్రాంగం నుండి స్పష్టమైన దూరం పాటించడం తన నైతిక, ధర్మబద్ధమైన బాధ్యతని తెలిపారు. దీంతో బొలిశెట్టి వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+