• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మంత్రి' ఓటమి కోసం పావులు కదుపుతున్న జనసేన?

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయంగా ప్ర‌త్యర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జం. కానీ అవి వ్య‌క్తిగ‌తానికి దారితీసిన‌ప్పుడే ప్ర‌త్య‌ర్థులు కాస్తా శ‌త్రువులుగా మార‌తారు. ఇటీవ‌లి ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల‌ను విశ్లేషిస్తే ఏ పార్టీ కూడా మ‌రో పార్టీని ప్ర‌త్య‌ర్థిగా చూస్తున్న దాఖలాలు క‌న‌ప‌డ‌టంలేదు. ఎవ‌రికి వారు శ‌త్రువులుగా భావిస్తుండ‌టం మంచి ప‌రిణామం కాద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త అంశాల జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని, కేవ‌లం రాజ‌కీయం వ‌ర‌కే విమ‌ర్శ‌లు ప‌రిమితంకావాల‌ని సూచిస్తున్న‌ప్ప‌టికీ వాటిని పెడ‌చెవిన పెడుతున్న నేత‌లే ఎక్కువ‌య్యారు.

 పవన్ పై విరుచుకుపడుతున్న మంత్రులు

పవన్ పై విరుచుకుపడుతున్న మంత్రులు


జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు లక్ష్యంగా ఎంచుకున్నారని, పదే పదే తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారని జనసేన సైనికులు మండిపడుతున్నారు. అటువంటివారిని రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రిపై జ‌న‌సేన సైనికులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. పార్టీ కార్యాల‌యంలో జెండా ఎగ‌ర‌వేసిన అనంత‌రం వ‌ప‌న్ చేసిన వ్యాఖ్య‌లకు సదరు మంత్రి కౌంట‌ర్ ఇచ్చారు. చేనేత వ‌స్త్రాల ఛాలెంజ్ ఆపి 175 సీట్ల‌కు పోటీచేస్తున్నారో? లేదో? చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై జ‌న‌సేన శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

 ఎలాగైనా ఓడిస్తాం..

ఎలాగైనా ఓడిస్తాం..


చేనేత వ‌స్త్రాల‌కు డిమాండ్ క‌ల్పిస్తే కార్మికుల‌కు ఉపాధి ల‌భిస్తుంద‌నే స‌దుద్దేశంతో చేస్తున్న ఈ కార్య‌క్ర‌మంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి ఆయనకు ఏ అర్హత ఉందని ప్ర‌శ్నిస్తున్నారు. అలా చెప్ప‌డం సిగ్గుచేట‌ని, తాము ఎన్నిస్థానాల్లో పోటీచేస్తామనేది తమ ఇష్టమని స్పష్టం చేస్తున్నారు. ప్ర‌తిసారి త‌మ అధినేత‌పై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతున్న మంత్రిని ఈసారి ఎన్నిక‌ల్లో ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌ను జ‌న‌సేన శ్రేణులు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

 ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం

ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం

గ‌త ఎన్నిక‌ల్లో ఆ మంత్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే స‌మ‌యంలో జ‌న‌సేన‌కు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేసి విజ‌యం కోసం స‌హ‌క‌రించాల‌ని కోరార‌ని, కొంద‌రు మ‌ద్ద‌తు తెలిపార‌ని, కానీ త‌మ నేత‌పైనే ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు చేస్తార‌ని తాము ఊహించ‌లేదంటున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఆయన్ను ఓడించ‌డానికి గ‌తంలో ఎలాగైతే స‌మావేశాలు ఏర్పాటు చేశారో అదే త‌ర‌హాలో తాము కూడా స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని, త‌మ నేత‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌ల‌పై పార్టీ శ్రేణుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తామ‌ని, ప్ర‌జ‌ల్లోకి ఈ విష‌యం తీసుకువెళ్లి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన‌ను గెలిపించుకుంటామ‌ని చెబుతున్నారు.

English summary
Jana Sena's Pawan Kalyan has been targeted by some leaders of the YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X