26 రోజులు తొక్కిపాడేశారు.. కిరణ్ రాయల్ షాకింగ్- పవన్ నిర్ణయంపై..!
లక్ష్మీరెడ్డితో ఆర్ధిక లావాదేవీల వ్యవహారంపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ ఇవాళ నోరు విప్పారు. తాజాగా తనతో వివాదం సెటిల్ అయ్యిందంటూ లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో కిరణ్ రాయల్ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. ఏం జరిగినా తన మంచికే జరిగిందన్నారు. 26 రోజులు నన్ను ఎలా తొక్కలో అలా తొక్కారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికీ నా జీవితాంతంలో రుణపడి ఉంటానన్నారు. అది ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాగా, రెండవది మీడియాకి అన్నారు.
తాను ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్ కి తెలిసి, విచారణ చేయమన్నారని అధినేతపై కిరణ్ రాయల్ ప్రశంసలు కురిపించారు. తనతో పాటు ఉన్న వాళ్ళే తనను నమ్మలేదని ఆయన తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. తనను, పిల్లలను హింస పెట్టారన్నారు. రాజకీయాలు చేస్తే, మానసికంగా తొక్కారన్నారు. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూశారన్నాు. తనకు ,లక్ష్మి రెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయన్నారు.

ఒక మహిళను రాజకీయాల్లోకి లాగి అనేకరకాలుగా హింసకు గురి చేశారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఆ మహిళకు ఆర్దికంగా ఆశ చూపి, కొడుకులను బెదిరింపులకు గురి చేశారన్నారు. ఈ 26 రోజులు చాలా నేర్చుకున్నానన్నారు. ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఇంకా వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్దులపై ఫైర్ అయ్యారు. అన్యాయం జరిగింది అంటే కోర్టులో వాదించాలని, కానీ ఒక అడ్వకేట్ సాక్షి టీవీలో వాదించకూడదన్నారు. తాను మొండి వాడిని కాబట్టే నిలబడ్డానని, ఇంకా ఎవరైనా అయి ఉంటే, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే ఉంటారన్నారు.
26 రోజులుగా తన ఫ్యామిలీ బయటకు రాలేదని, ఒక చైన్ వేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారా అని కిరణ్ ప్రశ్నించారు. వైసీపీలో రాసలీలల రాజాలు చాలామందే ఉన్నారని, వారు నిజాయితీ పరులా అని అడిగారు. తనపై ఎవరు కుట్ర చేశారో పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతానన్నారు. ఒక సామాన్య వ్యక్తి తిరుపతిలో రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. కిల్లి కొట్టు వ్యక్తి,రాజకీయాలు చేయకూడదా అన్నారు. మోదీ, ఎన్టీఆర్ ఎలా వచ్చారు, క్రింద నుంచే కదా వచ్చారన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. క్లీన్ చిట్ తో మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానన్నారు.












Click it and Unblock the Notifications