TTD: బీఆర్ నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవిపై నాగబాబు రియాక్షన్ ఇదే..!
ఏపీ ప్రభుత్వం తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీవీ 5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడు ఛైర్మన్ గా 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త బోర్డు ఏర్పాటు అయింది. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడికి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి రావడంపై గతంలో ఈ పదవిని ఆశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు స్పందించారు.
టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకంపై స్పందిస్తూ నాగబాబు ఇవాళ ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. ఇందులో హిందు ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే TV5 ఛైర్మన్ B.R నాయుడు గారికి టీటీడీ ఛైర్మన్ హోదా రావడం శుభసూచికం అని నాగబాబు తెలిపారు. సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాల సంతోషంగా ఉందన్నారు. మునుపు ఉన్న అవకతవకలన్ని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ ని మరింత మెరుగుపరచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు నాగబాబు వెల్లడించారు.

హిందు ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే TV5 ఛైర్మన్ B.R నాయుడు గారికి @BollineniRNaidu T.T.D ఛైర్మన్ హోదా రావడం శుభసూచికం,
— Naga Babu Konidela (@NagaBabuOffl) November 1, 2024
సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాల సంతోషంగా ఉంది..
మునుపు ఉన్న అవకతవకలన్ని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ ని…
అలాగే జనసేన తరపున టీటీడీ సభ్యులుగా ఎన్నికైన బురగపు ఆనంద సాయి, అనుగోలు రంగశ్రీ, మహేందర్ రెడ్డికి, ఇతర సభ్యులకు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతంలో తాను ఆశించిన టీటీడీ ఛైర్మన్ పదవి బీఆర్ నాయుడికి దక్కినా నాగబాబు మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంపై జనసేన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీల నేతలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications