Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మనోహర్ ను టీడీపీ ముంచేనా, గెలిపించేనా - గ్రౌండ్ రిపోర్ట్..!!

ఏపీలో పార్టీల ముఖ్య నేతల నియోజకవర్గాల్లో ఆసక్తి కర రాజకీయం కొనసాగుతోంది. కూటమి పార్టీలకు చెందిన ప్రధాన నేతల నియోజకవర్గాల్లో వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. టీడీపీ సహకారం పైన ఇంకా అనుమానాలు వీడలేదు. మనోహర్ ను గెలిపించుకోవటం పవన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో, తెనాలి కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది.

మనోహర్ కు కలిసొచ్చేనా
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. స్పీకర్ గా పని చేసారు. ప్రస్తుతం జనసేనలో పవన్ తరువాత ఆయనే కీలక నేతగా ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు విషయంలోనూ ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మద్దతుతో మరోసారి తెనాలి బరి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోటీలో ఉన్నారు. తెనాలిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీకే అధికారం దక్కుతుందనే సెంటిమెంట్ ఉంది. 1983 ఎన్నికల నాటి నుంచీ ఇది ఆనవాయితీగా వస్తోంది. అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గం.నియోజకవర్గంలో ఎస్సీ, కాపు, కమ్మ సామాజిక వర్గాలది కీలక పాత్ర. తటస్థంగా ఉండే ఆర్యవైశ్యుల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి.

Janasena leader Manohar facing big fight in Tenali TDP support becomes Crucial

హోరా హోరీ పోరు
నాదెండ్ల మనోహర్‌ కు సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరుంది. కాపు, కమ్మ సామాజికవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం. ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే..నియోజవకర్గంలో అందుబాటులో ఉండరనే ప్రచారం ఉంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వర్గీయుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. పవన్ తెనాలి ప్రచార సమయంలోనూ రాజా పాల్గొనలేదు. చంద్రబాబు సైతం మనోహర్ కు మద్దతుగా తెనాలిలో ప్రచారం చేసారు., అయితే, వైసీపీ అభ్యర్ది శివకుమార్ కు స్థానికంగా గుర్తింపు ఉంది. అందరికీ అందుబాటులో ఉంటారనే పేరుంది. వైసీపీ తరపున గెలిచినా టీడీపీ వారికీ పనులు చేసిపెట్టడంతో పాటుగా స్థానిక సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయనే నమ్మకం ఉంది.

టీడీపీ ఓటింగ్ కీలకం
నియోజకవర్గంలో స్సీలు: 56 వేలు, కాపులు: 40 వేలు, కమ్మ: 31 వేలు, వైశ్యులు: 26 వేలు, ముస్లిం: 24 వేలు, యాదవ: 20 వేలు, రెడ్లు: 12 వేల ఓట్లు ఉన్నాయి. ఈసారి మనోహర్‌ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవడంతో విజయం ఖాయమని కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, టీడీపీ నేత ఆలపాటి రాజా వర్గం పోలింగ్ లోఏ మేర సహకారం అందిస్తుందనేది కీలకంగా మారుతోంది. ఇద్దరి మధ్య ప్రస్తుతం పోటీ హోరా హోరీగా కనిపిస్తోంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా మెజార్టీ చాలా స్వల్పంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, పోలింగ్ శాతం తెనాలి ఫలితంలో కీలకంగా మారనుంది. అదే సమయంలో టీడీపీ నేతల సహకారం పైనే మనోహర్ గెలుపు ఆధార పడి ఉండటంతో..ఇక్కడి ఫలితం పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+