రసికరాజా.. ఇద్దరు మంత్రుల పేరుతో సినిమా; గుడివాడ అమర్నాథ్,అంబటి రాంబాబులపై జనసేన తిట్లదండకం!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలపై స్పందించిన జనసేన నేతలు తీరవ స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ మంత్రులను వారిదైన శైలిలో తిట్టిపోశారు.

రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విషసర్పాలు.. మంత్రులపై జనసేన నేతల పోస్టర్ ఆవిష్కరణ

రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విషసర్పాలు.. మంత్రులపై జనసేన నేతల పోస్టర్ ఆవిష్కరణ

సీఎం జగన్ సహా మంత్రులంతా సిబిఐ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులని జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. రసిక రాజా ఇద్దరు మంత్రుల పేరుతో సినిమా తీస్తామని తిరుపతి ఇన్చార్జ్ జనసేన పార్టీ కిరణ్ రాయల్ మంత్రులను టార్గెట్ చేశారు. క్యాబినెట్ లో ఉన్నవారు మంత్రులా కంత్రులా అంటూ మండిపడిన కిరణ్ రాయల్, రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విషసర్పాలు అంటూ పోస్టర్ ను ఆవిష్కరించారు. జగన్ రెడ్డి పేరు జైలు రెడ్డి.. కేరాఫ్ చంచల్గూడా జైలు అని, సీఎం ను ఇకనుండి జైలు రెడ్డి అని పిలుస్తామని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంజనా, సుకన్య గా పేరుమారిస్తే అంబటి రాంబాబు త్వరగా పూర్తి చేస్తారేమో

పోలవరం ప్రాజెక్టుకు సంజనా, సుకన్య గా పేరుమారిస్తే అంబటి రాంబాబు త్వరగా పూర్తి చేస్తారేమో

అంతేకాదు మొన్నటి వరకు జగన్ మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించిన మంత్రులందరూ జోకర్ లని, ఇక కొత్తగా వచ్చిన మంత్రులు బఫూన్లలా ఉన్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ విషయంలో మరోసారి తీవ్ర పదజాలం వాడితే వారి కంటే తీవ్రంగా ప్రతి స్పందిస్తామని కిరణ్ రాయల్ తేల్చిచెప్పారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన కాపు మంత్రుల చీటీని జగన్ చించేశారని పేర్కొన్న కిరణ్ రాయల్ పోలవరం ప్రాజెక్టుకు సంజనా, సుకన్య గా పేరు మార్చితే అంబటి రాంబాబు త్వరగా పూర్తి చేస్తారేమో అంటూ సెటైర్లు వేశారు.

ఇద్దరు మంత్రులను చెప్పులు, చాటలతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి

ఇద్దరు మంత్రులను చెప్పులు, చాటలతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి

గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇద్దరు మంత్రులతో రసిక రాజా అంటూ సినిమా తీస్తామని పేర్కొన్నారు. ప్రజలే ఇద్దరు మంత్రులను చెప్పులు,చాటలతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తో ఫోటో కోసం పాకులాడిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

గతంలో చించుకున్న మంత్రులంతా గొడ్ల చావిడికి పరిమితం అయ్యారు

గతంలో చించుకున్న మంత్రులంతా గొడ్ల చావిడికి పరిమితం అయ్యారు

జనసేన పిఏసి సభ్యులతో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా వైసిపి మంత్రులపై విరుచుకు పడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చించుకున్న మంత్రులు అంతా గొడ్ల చావిడి కి పరిమితమయ్యారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జీవితం బహిరంగ రహస్యమేనని పేర్కొన్న జనసేన నేత వైసిపి నేత లాగా చీకటి బ్రతుకు తమకు లేదని మండిపడ్డారు. వ్యభిచార గృహాలు నడిపే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శించే వారయ్యారా అంటూ ప్రశ్నించారు. వైజాగ్ లో మంత్రి అమర్నాథ్ భూ కబ్జాలపై పోరాటం చేస్తామని, నోరు అదుపులో పెట్టుకోకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజలతో తన్నులు తినే పనులు చేయొద్దని జనసేన నేతలు హితవు పలికారు.

పవన్ కళ్యాణ్ మీద సినిమా.. ఐదారుగురు హీరోయిన్లు కావాలన్న అంబటి వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మీద సినిమా.. ఐదారుగురు హీరోయిన్లు కావాలన్న అంబటి వ్యాఖ్యలు


పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన అంబటి రాంబాబు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కు తనకంటూ సొంత ఆలోచన లేదని మండిపడ్డారు. అంబటి రాంబాబు నారావారి దత్త పుత్రుడు అని పవన్ కళ్యాణ్ మీద సినిమా తీయాలనుకున్నామని కాకపోతే ఒక హీరోయిన్ సరిపోదు, ఐదారుగురు హీరోయిన్స్ కావాలంటూ సెటైర్లు వేశారు. రైతు సంక్షేమం కోసం జగన్ ఎంత చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం దారుణం అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

 పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు: మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు: మంత్రి అమర్నాథ్

ఇక పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శించారు. వ్యక్తిగత జీవితంలోనే కాదు రాజకీయ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ విలువలు లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో తెలుసుకోవాలనుంటే ఆయన రెండో మాజీ భార్య రేణు దేశాయ్ ని అడిగితే తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు పై విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+