అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరసాపురం ఎంపీ అభ్యర్థి ఖరారు?

|
Google Oneindia TeluguNews

ఎన్నికలు జరిగినప్పుడల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం అన్ని పార్టీలను ఊరిస్తుంటుంది. కానీ ఇక్కడ గెలవడం ఏ పార్టీకి అంత సులువుగాదు.. అలా అని కష్టమూ కాదు.. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే చాలు.. వారంతటవారే ఓట్ల వర్షం కురిపిస్తారు. అందుకే ప్రతి పార్టీ ఇక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుంటాయి.

టీడీపీ గెలుపును ప్రభావితం చేసిన జనసేన

టీడీపీ గెలుపును ప్రభావితం చేసిన జనసేన


తెలుగుదేశం పార్టీ నరసాపురం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ లోక్ సభకు వచ్చేసరికి పొత్తుల్లో భాగంగా ఉండే పార్టీలకు కేటాయిస్తుంది. 2014లో బీజేపీకి కేటాయించింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన కనుమూరి రఘురామకృష్ణరాజు తన సమీప ప్రత్యర్థి వేటుకూరి వెంకటశివరామరాజుపై 31వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. జనసేన తరఫున పోటీచేసిన నాగబాబు మూడోస్థానంలో నిలిచారు. ఆయన ఆ ఎన్నికల్లో 2, 50, 289 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి గెలుపుపై ఆయన తీవ్ర ప్రభావం చూపించారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన నాగబాబు

గట్టి పోటీ ఇస్తారనుకున్న నాగబాబు టీడీపీ ఓడిపోవడానికి కారకుడయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం నాగబాబుకు అదే మొదటిసారి. మరోసారి అక్కడి నుంచే పోటీచేసి విజయం సాధించాలనే యోచనతో జనసేన ఉంది. నాగబాబును తిరిగి అక్కడ నిలబెట్టబోతోంది. విశాఖపట్నం పర్యటనలో పవన్ కల్యాణ్ వెంట ఉన్న నాగబాబు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. తర్వాత మంగళగిరిలోని పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు.

అంతా నాగబాబు చూసుకుంటాడులే..

అంతా నాగబాబు చూసుకుంటాడులే..


అప్పుడు నరసాపురం నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు పవన్ ను కలివారు. వైసీపీ ఇక్కడ దూకుడుగా వ్యవహరిస్తోందని, కనీసం తమకు బ్యానర్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పవన్.. ''నాగబాబు చూసుకుంటాడులే.. త్వరలోనే ఆయన వస్తారు.. ఆయనకు చెప్పండి'' అన్నారు. దీంతో మరోసారి నరసాపురం టికెట్ నాగబాబుకే కేటాయిస్తారని స్పష్టమవుతోంది. టీడీపీతో పొత్తు కుదిరినప్పటికీ ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నాగబాబు పోటీచేస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. నరసాపురం నియోజకవర్గంలో క్షత్రియులు, కాపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్షత్రియ సామాజికవర్గాన్ని మెప్పించేలా ఇటీవల భీమవరం పర్యటనలో పవన్ వారిని కొనియాడుతూ ప్రసంగించారు.

English summary
Although Telugu Desam Party is strong in all the assembly constituencies under Narasapuram, when it comes to Lok Sabha, it allocates to parties that are part of alliances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X