tdp: తెలుగుదేశం Vs జనసేన.. వేడెక్కిన AP రాజకీయం?

tdp:వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే ప్రధాన పార్టీల లక్ష్యంగా ఉంది. అందుకు ఇప్పటినుంచే వ్యూహ, ప్రతివ్యూహాలతో పార్టీల అధినేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునాయుడు, జనసేన నుంచి పవన్ కల్యాణ్ ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు.

విశాఖ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు

విశాఖ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు

విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియా సమావేశం పెట్టినప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లడం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. విశాఖలో ప్రధానమంత్రిని పవన్ కలిసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తున్నాయి.

2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ?

2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ?

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి జనసేనకు బీజేపీతో పొత్తు ఉంది. పొత్తు ఉందని బీజేపీ నేతలు చెబుతుంటారు.. జనసేన మాత్రం స్పష్టం చేయదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పే పవన్ ప్రధానమంత్రిని కలిసిన తర్వాత తనకు కూడా ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కలిసివెళ్లే అవకాశం లేదని అర్థమైంది.

పొత్తుంటే ధైర్యంగా చెబుతాం..

పొత్తుంటే ధైర్యంగా చెబుతాం..

నాదెండ్ల ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తమ పార్టీ పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తుందని, ఏ పార్టీతో అయినా పొత్తుంటే ధైర్యంగా చెప్పే దమ్ము తమ నేత పవన్ కల్యాణ్ కు ఉందని చెప్పారు. కొన్ని పార్టీలు తమపై కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని, వాటిని తట్టుకొని రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఎదుగుతుందన్నారు.

తమ పార్టీ బలపడుతుందనే రెండు పార్టీలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. మనోహర్ రెండు పార్టీలు అంటూ టీడీపీ, వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో టీడీపీ-జనసేన పొత్తుకు కాలం చెల్లిందని అర్థమైంది.

బీజేపీతోనే జనసేన కలిసి వెళ్లబోతుందనేవిషయంపై స్పష్టత వచ్చింది. తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయకుండా కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తూ వచ్చిన జనసేన ఇప్పుడు టీడీపీపై కూడా విమర్శలదాడి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+