జనసేనకు మరో సీటు గోవిందా.. ?
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు మూడు లోక్ సభ నియోజకవర్గాలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించింది. బీజేపీ నుంచి ఒత్తిడి రావడంతో ఒక లోక్ సభ స్థానాన్ని జనసేన ఆ పార్టీకి కేటాయించింది. అసెంబ్లీ స్థానాల్లో కూడా మూడు సీట్లను త్యాగం చేసింది. 24 నుంచి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 18 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను పవన్ ప్రకటించారు.
తాజాగా మిగిలిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు ఓ సీటు కేటాయించాలంటూ బీజేపీ పవన్ పై ఒత్తిడిపెడుతోందంటున్నారు. తొలిసారి కొన్ని సీట్లు త్యాగం చేయగా మరోసారి త్యాగం చేయాలనుకుంటున్నప్పటికీ జనసే క్యాడర్ మాత్రం ఒప్పుకోవడంలేదు. తాము మరో అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన నుంచి కోరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. ముందుగా చంద్రబాబును కోరినప్పటికీ అప్పటికే ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. దీంతో ఆయన జనసేనవైపు వేళ్లు చూపించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, ఉమ్మడి కడప జిల్లా రాజంపేటల్లో ఏదో ఒకటి కేటాయించాలని బీజేపీ కోరుతోంది. ఏపీకి ఎన్నికల ఇన్ ఛార్జిగా నియమితులైన బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 11వ సీటుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ నుంచి స్పందన రావడంలేదు. కేవలం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలే పెండింగ్ లో ఉన్నాయి. ఇవేవీ ఆ పార్టీ వదులకునేవి కావు. దీంతో టీడీపీ బీజేపీ ప్రతిపాదనలను జనసేన కోర్టులోకి నెట్టేసింది. పవన్ కల్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications