వైసీపీ ఎమ్మెల్యేకు జనసేన షాక్-రోడ్డుపై కాన్వాయ్ ఆపి మరీ....
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భఁగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ ఉండేది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం, జనసేన దారుణ పరాజయంతో పరిస్ధితులు మారిపోయాయి. ఏపీలో జనసేన గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో ఇప్పుడు జనసేన జిల్లాలో వైసీపీని టార్గెట్ చేసే పనిలో పడింది.
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ, జనసేన మధ్య సాగుతున్న పోరులో భాగంగా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. ముక్తేశ్వరం కూడలి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను జనసేన నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగి వారితో మాట్లాడారు. దీంతో వారు స్ధానికంగా ఓ సమస్యకు సంబంధించి ఎమ్మెల్యే చిట్టిబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ అసలేం జరిగిందంటే...

తూర్పు గోదావరి జిల్లా:లోని అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ప్రదాన కూడలిలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అదే సమయంలో వైఎస్ఆర్ సిపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాన్వాయ్ అటు నుంచి వెళ్తోంది. దీంతో జనసేన నేతలు వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబును ఆపారు. దీంతో ఆయన కూడా ఒక్కసారిగా షాక్ కు గురైనా.. అంతలోనే తేరుకుని కారు దిగారు. జనసేన నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వెల్లు ప్రాదాన కూడలి ముక్తేశ్వరం రహదారి చెరువులను తలపిస్తోందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహన చోదకులు తరచూ ప్రమాదానికి గురౌతున్నారని, తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యేకు, ఎమ్.పి.డి.ఒ కే.ఆర్.విజయకు జనసేన పార్టీ శ్రేణులు వినతిపత్రం అందజేశారు.
వైసీపీ ఎమ్మెల్యేకు జనసేన షాక్-రోడ్డుపై కాన్వాయ్ ఆపి మరీ....#andhrapradesh, #eastgodavari #pgannavaram #kondetichittibabu pic.twitter.com/4UyyXLfSIi
— oneindiatelugu (@oneindiatelugu) July 8, 2021
వైసీపీ ఎమ్మెల్యేకు జనసేన షాక్-రోడ్డుపై కాన్వాయ్ ఆపి మరీ....#andhrapradesh, #eastgodavari #pgannavaram #kondetichittibabu pic.twitter.com/oWS1HALzvE
— oneindiatelugu (@oneindiatelugu) July 8, 2021
Recommended Video
వైసీపీ ఎమ్మెల్యేకు జనసేన షాక్-రోడ్డుపై కాన్వాయ్ ఆపి మరీ....#andhrapradesh, #eastgodavari #pgannavaram #kondetichittibabu pic.twitter.com/2gwuPgXAL2
— oneindiatelugu (@oneindiatelugu) July 8, 2021












Click it and Unblock the Notifications