పొత్తుపై జన సైనికుల ఆలోచన మారుతోందా?
ఎవరెన్ని రకాలుగా వార్తలు రాసినా తమ అధినేత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లడానికే సిద్ధపడ్డారని, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని జనసైనికులు తమ అధినేతను కొనియాడుతున్నారు.
తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకొని పోటీచేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకు ఊతమిచ్చేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండుసార్లు సమావేశమై మీడియాతో మాట్లాడారు. పొత్తుల విషయం గురించి అడిగిన విలేకర్లకు ఇది సమయం కాదంటూ సమాధానం దాటవేశారు.
ఒక దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ వ్యాసంలో పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, హననం చేసేలా ఉందంటూ జనసే వర్గాలు మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టడానికి తమ అధినేత సిద్ధపడ్డారని, అటువంటి వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకు లొంగరని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరెన్ని రకాలుగా వార్తలు రాసినా తమ అధినేత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లడానికే సిద్ధపడ్డారని, వైసీపీని గద్దె దించి ఏపీని అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకు తనవంతు కృషి తాను చేస్తున్నారని, ప్రజలకు సేవ చేసే విషయంలో నిబద్ధతతో పనిచేసే తమ అధినేత గురించి అవాకులు, చెవాకులు, తప్పుడు వార్తలు వ్యాపింప చేస్తున్నారని ఇటువంటి వాటిని జనసైనికులు తిప్పికొట్టాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సంబంధించి అనధికారికంగా ఒక స్పష్టత తమ పార్టీకి ఉందని, పోటీచేయబోయే నియోజకవర్గాలతోపాటు పొత్తుందంటూ అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications