జనసేన నుంచి గెలిచేదెవరు, ఇదీ లెక్క - పవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..!!

ఏపీ ఎన్నికల్లో ఈ సారి పవన్ కల్యాణ్ కీలకంగా నిలిచారు. జగన్ ఓటమి కోసం మూడు పార్టీలను ఏకం చేయటం లో కీలక పాత్ర పోషించారు. జగన్ వ్యతిరేక ఓటమి చీలకూడదనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి జత కట్టటంతో అనుకున్న లక్ష్యం నెరవేరిందా. ఓటింగ్ సరళిపై జనసేన చేసిన సమీక్షలో ఏం తేల్చారు. పిఠాపురం ఫలితం పై అంచనాలేంటి. పార్టీ చేసిన సుదీర్ఘ సమీక్ష లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గెలుపు అంచనాలు
ఏపీలో జనసేన 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా పవన్ 21 సీట్లకు అంగీకరించటం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి పవన్ సమాధానం ఇచ్చారు. తన వ్యూహం తనకు ఉందని చెప్పారు. స్ట్రైకింగ్ రేట్ 100 శాతం ఉండాలని సూచించారు. ఈ సారి ప్రచారంలో ప్రధానంగా జగన్ ను టార్గెట్ చేసారు.

Janasena Predictions over winning seats in AP elections Pawan Review with Key leaders

తనతో పాటుగా కూటమి అభ్యర్దులకు అవకాశం ఇవ్వాలని కోరారు. పిఠాపురంలో పవన్ కోసం పలువురు ప్రచారం చేసారు. అక్కడ పవన్ గెలుపు ఖాయమని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మెజార్టీ పైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. అదే సమయంలో పవన్ తో పాటుగా జనసేన నుంచి ఎవరెవరు గెలుస్తారనే లెక్కలు మొదలయ్యాయి.

పోలింగ్ సరళి పై లెక్కలు
పోలింగ్ పూర్తయిన తరువాత ఓటింగ్ సరళి పైన జనసేన నేతలు సమీక్ష చేసారు. జనసేన సీట్ల ఎంపికలోనూ సామాజిక సమీకరణాలు...స్థానిక బలం ఆధారంగా సీట్లను ఎంపిక చేసుకుంది. పోలింగ్ లో సామాజిక లెక్కలు అంచనాలకు తగినట్లుగానే కలిసి వచ్చినట్లు నిర్దారణకు వచ్చారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం కొంత మేర అంచనాలు తప్పినట్ల తేల్చారు.

టీడీపీ, బీజేపీ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా సహకారం అందగా..మరి కొన్ని చోట్ల మాత్రం ఆశించిన స్థాయిలో ఓట్ల బదిలీ జరగలేదని నిర్దారణకు వచ్చారు. తూర్పు గోదావరిలో ఖచ్చితంగా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ఒక రూరల్ నియోజకవర్గంలో బకెట్ గుర్తుకు పడిన ఓట్లు జనసేన గెలుపును ప్రభావితం చేస్తుందనే అనుమానాలు మొదలయ్యాయి.

గెలిచే సీట్లు ఎన్ని
పశ్చిమ గోదావరిలో జనసేన నుంచి పోటీ చేస్తున్న వారిలో ఒకరు మినహా దాదాపు అందరూ గెలుస్తారనే అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా..ఉమ్మడి విశాఖ పరిధిలోనూ మంచి ఫలితాలు ఖాయంగా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. క్రిష్ణా లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని స్థానంలో పోల్ మేనేజ్ మెంట్ లో కొన్ని లోపాలను గుర్తించారు. అయినా..సరళి అనుకూలంగానే ఉందని..కౌంటింగ్ రోజునే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సీమలో పోటీ చేసిన స్థానాల పైన కొంత తర్జన భర్జన సాగుతోంది. దీంతో..జనసేన పోటీ చేసిన స్థానాల్లో 55 శాతం స్ట్రైకింగ్ రేట్ తో ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పవన్ మాత్రం మొత్తం ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలుస్తారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+