టీడీపీతో పొత్తు ఎఫెక్ట్ - జనసేనలో మొదలైన రాజీనామాలు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అటు సీఎం జగన్ వై నాట్ 175 అంటూ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. బీజేపీ పాత్ర పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ, జనసేన పొత్తు సక్సెస్ ఖాయమనే అంచనాలకు భిన్నంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తు ఎఫెక్ట్ తో జనసేనలో రాజీనామాలు మొదలయ్యాయి.

పొత్తు రాజకీయాలు:టీడీపీ, జనసేన పొత్తును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించిన తరువాత కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తు ప్రకటన తరువాత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ఉమ్మడి క్రిష్టా జిల్లాలో స్పందన తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతం కంటే స్పందన తగ్గిందనే చర్చ సాగుతోంది. ఇటు పవన్ కల్యాణ్ యాత్రకు పార్టీ సమీక్షల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. తమ రెండు పార్టీల పొత్తు తో ఉభయ గోదావరి జిల్లాల్లో పై చేయి సాధిస్తామని టీడీపీ, జనసేన అంచనా వేస్తున్నాయి. ఈ సమయంలోనూ వైసీపీ కౌంటర్ వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో పొత్తు జనసేన కేడర్ పైన ప్రభావం చూపిస్తున్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.

Janasena Rajanagarm Incharge Meda Gurudatta Resign for party along with followers

గోదావరి జిల్లాలపై ఆశలు:తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌..

ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మ­గౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విష­యం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు.పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని చెప్పుకొచ్చారు.

మొదలైన రాజీనామాలు:మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్‌ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు జనసేనకు గుడ్‌బై చెప్పారని గుర్తుచేశారు. అధిష్టానం అపాయింట్‌మెంట్‌ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు.

పార్టీ అధ్యక్షుడు పవన్‌ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్‌ తెలిపారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. అయితే, ఈ తరహా పరిస్థితులు ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నాయా..ఇతర నియోకవర్గాల్లోనూ మొదలవుతాయా అనే చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+