జనసేన బలోపేతానికి కమిటీలు..! ఇక క్షేత్ర స్థాలో పార్టీ పటిష్టమన్న పవన్‌ కల్యాణ్‌..!!

Recommended Video

    జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న పవన్ || Pawan Kalyan Set Up Four Committees || Oneindia Telugu

    అమరావతి/హైదరాబాద్ : జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలో పేతం దిశగా అడుగులు వేస్తోంది. 2019లో ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత పార్టీ సిద్దాంతలకు పదును పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని క్రిందిస్థాయినుంచి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తిన్నారు గబ్బర్ సింగ్. కమిటీలను నాలుగు విధాలుగా రూపకల్పన చేసి, విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత కమిటీలను ప్రకాటించాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు నేడు అమరావతి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో జగన్ సమావేశం నిర్వహించారు.

     జనసేప క్షేత్రస్తాయిలో బలోపేతం..! యాక్షన్ లోకి దిగిని గబ్బర్ సింగ్..!!

    జనసేప క్షేత్రస్తాయిలో బలోపేతం..! యాక్షన్ లోకి దిగిని గబ్బర్ సింగ్..!!

    జనసేనను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నాలుగు కమిటీలను సిద్ధం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన ఈ కమిటీలపై ప్రకటన చేయనున్నారు. కొద్దికాలంగా ఈ అంశాలపై విస్తృతంగా సీనియర్‌ నాయకులతో చర్చించిన పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమైన ఈ కమిటీల ఏర్పాటుకు రూపకల్పన చేశారని సమాచారం. వీటిల్లో పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌ కమిటీ, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మానిటరింగ్‌ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మానిటరింగ్‌ కమిటీ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి కొలిక్కి వీటిని తీసుకొచ్చారని చెబుతున్నారు.

     పార్టీ బలోపేతం కోసం నాలుగు కమిటీలు..! రూపకల్పన చేసిన కాటమరాయుడు..!!

    పార్టీ బలోపేతం కోసం నాలుగు కమిటీలు..! రూపకల్పన చేసిన కాటమరాయుడు..!!

    వర్తమాన రాజకీయాలు, ప్రజాసంక్షేమం, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని, యువతను దృష్టిలో ఉంచుకుని పార్టీ భవిష్యత్‌ వ్యూహాలను పవన్‌ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయాలను నెరపుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రణాళికలను తయారు చేశారని, అన్ని పార్లమెంట్‌ స్థానాల పరిధిలో కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాడవాడలా జనసేన జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కూడా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.

     ఓటమిపై సమీక్షించుకుంటూనే సంస్థాగత బలోపేతం..! వినూత్న అడుగులు వేస్తున్న సేనాని..!!

    ఓటమిపై సమీక్షించుకుంటూనే సంస్థాగత బలోపేతం..! వినూత్న అడుగులు వేస్తున్న సేనాని..!!

    జనసేన పార్టీలో ముఖ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నారు పవన్ కళ్యాణ్. కమిటీల సభ్యులు పేర్లను అధికారికంగా రేపు ప్రకటించారు. ఈ కమిటీల ఏర్పాటు‌పై కొద్దిరోజులుగా సీనియర్ నాయకులతో చర్చించిన పవన్... ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పటికే జిల్లాల వారీగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొత్తతరం రాజకీయ వ్యవస్థ రూపకల్పన, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందిస్తామని పవన్ పేర్కొన్నారు.

     కష్టాలకు అదరం.. ఓటమికి బెదరం..! భవిష్యత్తులో ప్రభావం చూపుతామంటున్న పవన్ కళ్యాణ్..!!

    కష్టాలకు అదరం.. ఓటమికి బెదరం..! భవిష్యత్తులో ప్రభావం చూపుతామంటున్న పవన్ కళ్యాణ్..!!

    అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిపుష్టం చేయాలనే కృతనిశ్చయంతో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కొత్త కమిటీలను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ ప్రకటించారు. పవన్ ప్రకటించిన కమిటీల వివరాలు. 1)పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.). 2)లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ. 3)క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ. 4)వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ కమిటీ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+