ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన సర్వే
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు తమ ఫలితాలను ప్రకటించగా.. తాజాగా మరో సర్వే బయటకు వచ్చింది.జన్మత్ పోల్ సంస్థ తమ సర్వే నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాల్లో సర్వే చేపట్టామని జన్మత్ పోల్ సంస్థ తెలిపింది.కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జన్మత్ పోల్ సర్వే తేల్చి చెప్పింది.

ఎన్డీఏ కూటమి 543 స్థానాలకు 323 నుంచి 326 స్థానాల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉందని జన్మత్ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా గట్టిగానే ఉంటుందని జన్మత్ పోల్ సర్వే చెప్పుకొచ్చింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకోనుందని స్పష్టం చేసింది. ఆ పార్టీకి 21 నుంచి 23 లోక్ సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది.

తృణమూల్ కాంగ్రెస్ తరువాత స్థానం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీదేనని ఈ సర్వే ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా కనిపించినప్పటికీ.. ఏపీలో మాత్రం కూటమి వెనుకబడినట్లు ఈ సర్వే తెలిపింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కేవలం 5 నుంచి 7 లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే చెప్పుకొచ్చింది.
loksabha election 2024
— Janmat polls (@Janmatpolls) March 23, 2024
Total 543 seats
Ground report today
BJP =323-326
Congress =44-46
YSRCP=16-18
TMC=21-23
AAP=07-08
BJD =10-11
TDP+ =05-07
#LoksabhaElections2024
ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ 16 నుంచి 18 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని జన్మత్ సర్వే తెలిపింది. 100 నుంచి 105 అసెంబ్లీ స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలో మరోసారి అధికారం వైసీపీదే అని ఈ సర్వే తేల్చింది. మూడు పార్టీలు కలిసి వచ్చినా.. జగన్ నేతృత్వంలోని వైసీపీని అధికారం నుంచి దూరం చేయలేరని ఈ సర్వే తేల్చి చెప్పింది. గత కొద్ది నెలలుగా జన్మత్ సంస్థ వరుసగా సర్వేలను ప్రకటిస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications