వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంబంధాలు బలపడ్డాయి: బాబుకు షింజో అబే హామి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

టోక్యో/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే భరోసా ఇచ్చారు. ఏపి కొత్త రాజధాని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, సహకారం అందిస్తామన్నారు. జపాన్ రాజధాని టోక్యోలోని ప్రధాని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందంతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. దౌత్య సంబంధాల్లో, వర్తక వాణిజ్యాల్లో భారతదేశం తమకు ఎంతో ముఖ్యమైందని అబే అన్నారు.

కేవలం కొద్ది నెలల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటించారని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జపాన్ పర్యటించారని ఇదో గొప్ప పరిణామమని అబే అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య, జపాన్‌తో ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పరస్పర సహకారం వృద్ధి చెందుతుందన్నారు. ఏపి అభివృద్ధికి అన్ని రంగాల్లో తమ సహకారం ఉంటుందని, రాజధాని నిర్మాణానికి అవసరమైన మద్దతు ఇస్తామన్నారు.

ప్రధానితో బాబు

ప్రధానితో బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే భరోసా ఇచ్చారు. ఏపి కొత్త రాజధాని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, సహకారం అందిస్తామన్నారు.

ప్రధానితో బాబు

ప్రధానితో బాబు

జపాన్ రాజధాని టోక్యోలోని ప్రధాని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందంతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. దౌత్య సంబంధాల్లో, వర్తక వాణిజ్యాల్లో భారతదేశం తమకు ఎంతో ముఖ్యమైందని అబే అన్నారు.

ప్రధానితో బాబు

ప్రధానితో బాబు

కేవలం కొద్ది నెలల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటించారని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జపాన్ పర్యటించారని ఇదో గొప్ప పరిణామమని అబే అభివర్ణించారు.

ప్రధానితో బాబు

ప్రధానితో బాబు

ఈ సందర్భంగా సిఎం తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని జపాన్ ప్రధానికి అందించారు. శాలువా కప్పి మెమెంటో ఇచ్చారు. ఎంతో పవిత్రమైన ఈ శాలువాతోనే తాము క్యాంపెయిన్‌కు వెళ్తామని ప్రధాని అబే అన్నారు.

ప్రధానితో బాబు

ప్రధానితో బాబు


జనవరిలో భారత పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కూడా సందర్శించాలని చంద్రబాబు జపాన్ ప్రధానిని కోరారు.

ఈ సందర్భంగా సిఎం తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని జపాన్ ప్రధానికి అందించారు. శాలువా కప్పి మెమెంటో ఇచ్చారు. ఎంతో పవిత్రమైన ఈ శాలువాతోనే తాము క్యాంపెయిన్‌కు వెళ్తామని ప్రధాని అబే అన్నారు. జనవరిలో భారత పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కూడా సందర్శించాలని చంద్రబాబు జపాన్ ప్రధానిని కోరారు. కొత్త రాజధాని నిర్మాణంలో జపాన్ సైతం భాగస్వామ్యం కావాలని , అపుడే ప్రపంచస్థాయి నగరంగా రాజధాని నిర్మాణం చేపట్టగలుగుతామన్నారు.

కృష్ణా నదికి ఇరువైపులా విస్తరిస్తూ రాజధాని నిర్మాణం చేపడతామని, పరిశ్రమలన్నీ శివారు ప్రాంతాల్లో నెలకొల్పుతామని, మిగిలిన ఆర్ధిక కార్యకలాపాలు అన్నీ రాజధాని నగరంలో ఏర్పాటు చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి డాక్టర్ నారాయణ, ఎంపీలు జయదేవ్, సిఎం రమేష్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు, సలహాదారు పరకాల ప్రభాకర్, భారత రాయబారి దీపా గోపాలన్ వాద్వా, ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర తదితరులున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Friday met Japanese Prime Minister Shinzo Abe, who promised his country's cooperation to the State in building a world-class capital city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X