జయకు చావు ముందే తెలుసు, విగ్రహం రెడీ: నేడు చెన్నైకి
కొత్తపేట/చెన్నై: ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే తాను చనిపోతానేమో ? అని జయలలితకు ముందే తెలుసా అని ప్రశ్నకు సమాధానం అంతుపట్టడం లేదు. అందుకే జయలలిత విగ్రహం ముందే చేయించారేమో అని అనిపిస్తోంది.
ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే దివంగతులైన ముఖ్యమంత్రులు ఎంజీ. రామచంద్రన్, ఇటీవలే మరణించిన జయలలిత కాంస్య విగ్రహాలు ఇప్పటికే సిద్దం అయ్యాయి. బుధవారం (డిసెంబర్ 7)వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నుంచి చెన్నై తీసుకు వెలుతున్నారు.
కొత్తపేటకు చెందిన శిల్పి డి. రాజ్ కుమార్ వడయార్ ఇప్పటికే ఎంజీఆర్, జయలలిత విగ్రహాలను తయారు చేశారు. శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన శిల్పికూడా. ఈయన కాంస్య విగ్రహాలు తయారు చెయ్యడంలో దిట్ట. ఆయనకు ఆయనే పోటీ అంటుంటారు.

2017 జనవరిలో తమిళనాడులోని అన్నా యూనివర్శిటీలో నిలువెత్తు ఎంజీఆర్ కాంస్య విగ్రహాన్ని జయలలిత ఆవిష్కరించవలసి ఉంది. అయితే ఎంజీఆర్ విగ్రహం ఆవిష్కరించాల్సిన కోరిక తీరకముందే మరణించారు.
ఇప్పుడు ఎంజీఆర్ తో పాటు జయలలిత కాంస్య విగ్రహాలను అవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత జయంతి సందర్బంగా ఎంజీఆర్, జయలలిత విగ్రహాలను అన్నా యూనివర్శిటీలో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications