శక్తిమంతమైన నాయకురాలు: మోడీ దిగ్భ్రాంతి, రేపు చెన్నైకి చంద్రబాబు
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు, పేదల సంక్షేమానికి ఆమె చేసిన కృషి ఆదర్శనీయమన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి తమిళనాడు ప్రజలకు భగవంతుడు ఇవ్వాలని కోరుకన్నారు.
ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు. భారత రాజకీయాలలో ఓ గొప్ప నాయకురాలు వెళ్లిపోయిందని అన్నారు. ఆమె స్ఫూర్తిమంతమైన నేత అని, ఆమెను కలుసుకోవడం తనకు వచ్చిన గొప్ప అవకాశమన్నారు.

శక్తిమంత నాయకురాల్ని కోల్పోయింది: చంద్రబాబు
జయలలిత మృతితో దేశం ఒక శక్తిమంతమైన నాయకురాల్ని కోల్పోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా జీవితంలో ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జయలలితకు నివాళులు అర్పించేందుకు మంగళవారం ఉదయం ఆయన చెన్నై వెళ్లనున్నారు.
పోయెస్ గార్డెన్‌కు జయ పార్థివదేహం
జయలలిత పార్థివదేహాన్ని ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌కు తరలించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోయెస్ గార్డెన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications