జేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్‌కు దూరం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో బీజేపీ - తెలుగుదేశం పార్టీ మధ్య దూరం పెరుగుతోందా? అంటే కాదనలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇరు పార్టీల నాయకులు వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. గత వారం రోజులుగా బీజేపీ నేతలు టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, ఇతర బీజేపీ నేతలు టీడీపీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం కమలం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఓ సమయంలో టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కానీ చంద్రబాబు వారించారు.

గెటౌట్ అంటారు, మోడీకి దయ అవసరంలేదు, బాబు స్థాయి మరిచి మరీ, చేతులెత్తేశాం: జేసీ సంచలనం

బీజేపీ నేతలు రెచ్చిపోతున్నా టీడీపీ మౌనం, బాబు వ్యూహమా?

బీజేపీ నేతలు రెచ్చిపోతున్నా టీడీపీ మౌనం, బాబు వ్యూహమా?

దీంతో వరుసగా బీజేపీ నేతలు మాటల దాడి చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు ఒకింత మౌనం పాటిస్తున్నారు. అధినేత ఆదేశాల మేరకు వారు మిన్నకుండిపోయారు. దీని వెనుక బాబు వ్యూహం కూడా ఉండి ఉండవచ్చునని అంటున్నారు. పరిస్థితులు అటు ఇటు అయి బీజేపీకి దూరమైతే.. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ, ఇతర హామీలపై తాము ఇప్పటి వరకు ఓర్పు వహించామని, కానీ ఇప్పటికీ నెరవేర్చడం లేదని, పైగా బీజేపీ నేతలు మాటల దాడి చేసినా తాము మిన్నకుండిపోయామని, వారి అధిష్టానం మాత్రం వారిని అదుపులో పెట్టలేకపోయిందని చెప్పడానికి టీడీపీకి ఆస్కారం ఉందని అంటున్నారు.

ప్యాకేజీ తీసుకుంటున్నారా, లెక్కేంటి?: పవన్‌పై మహేష్ కత్తి కొత్త డౌట్లు ఎన్నో

పోలవరంపై డైలమా

పోలవరంపై డైలమా


పోలవరం ప్రాజెక్టు అంశం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర అధికారి లేఖ, చంద్రబాబు, టీడీపీ నేతల అసంతృప్తి, దానికి బీజేపీ కౌంటర్, ఆ తర్వాత టీడీపీ వెనక్కి తగ్గడం, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ జోక్యం.. మళ్లీ ఇటీవలే కాపర్ డ్యాం అంశం.. ఈ అంశాలు టీడీపీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని అంటున్నారు.

మోడీ ప్రభుత్వంపై బాబుకు అంత ఆగ్రహం

మోడీ ప్రభుత్వంపై బాబుకు అంత ఆగ్రహం


కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారని, కానీ ఆయన ఓపిక పడుతున్నారని పరిస్థితులను బట్టి, టీడీపీ నేతల మాటల తీరును బట్టి అర్థమవుతోంది. మరి కొన్నాళ్లు చూసి.. హామీలు నెరవేర్చకుంటే బీజేపీకి కటీఫ్ చెప్పి దూరం జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. బాబు.. మోడీ ప్రభుత్వంపై ఆంత ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారని అంటున్నారు.

రూపానీ ప్రమాణానికి నో, మోడీకి బాబు అసంతృప్తి

రూపానీ ప్రమాణానికి నో, మోడీకి బాబు అసంతృప్తి

గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కాకపోవడం కూడా అసంతృప్తిలో భాగమే కావొచ్చని అంటున్నారు. తనకు బదులు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పంపించారు. ఈ చర్య ద్వారా చంద్రబాబు తన అసంతృప్తిని మోడీకి తెలియజేశారని అంటున్నారు. అయితే, అదేం లేదని, తన షెడ్యూల్ కారణంగా వెళ్లలేదనే వారు కూడా లేకపోలేదు.

వివిధ రూపాల్లో మోడీకి అసంతృప్తి

వివిధ రూపాల్లో మోడీకి అసంతృప్తి

ప్రభుత్వాలు కొలువుదీరిన కొత్తలో చంద్రబాబు పదేపదే ఢిల్లీకి వెళ్లారు. ఏపీకి రావాల్సిన హామీలు, కొత్త రాష్ట్రం కాబట్టి ఆదుకోవాలని ప్రధాని నుంచి కేంద్రమంత్రుల వద్దకు వెళ్లేవారు. కానీ కొన్నాళ్లుగా బాబు అటు చూడటం లేదు. మోడీ అపాయింటుమెంట్ ఇవ్వకపోవడం, హామీలు నెరవేర్చకపోవడం వంటి కారణాలతో బాబు తన అసంతృప్తిని వివిధ రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు.

వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లడం నష్టం తెచ్చిందా

వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లడం నష్టం తెచ్చిందా

ఏపీకి చెందిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం కూడా బాబుకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకు వచ్చిందని చెబుతున్నారు. ఢిల్లీలో పనులు కావాలంటే ఆయన వెంకయ్య ద్వారా ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు సుజనకు బాధ్యతలు అప్పగించారు. కానీ వెంకయ్య ఉంటే అది వేరేలా ఉంటుందని అంటున్నారు.

దుమారం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు

చంద్రబాబు లేదా టీడీపీ కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉందనడానికి టీడీపీ నేతల వ్యాఖ్యలే ఉదాహరణ అని చెబుతున్నారు. అధినేత చెబితే మిగతా వాళ్లు మౌనంగా ఉంటారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన కుండబద్దలు కొడతారు. బుధవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీకి క్లియర్ మెజార్టీ ఉందని, తాము వారు చెప్పినట్లే వినాల్సి వస్తోందని, చంద్రబాబు తన స్థాయిని మరిచి రాష్ట్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతోనే బీజేపీపై టీడీపీకి ఉన్న అసంతృప్తి తేటతెల్లమవుతోందని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu is unhappy with Narendra Modi government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి