పవన్ కళ్యాణ్ మంచోడు కానీ, ఆకాశంలో: జెసి, బాబుచే స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచివాడని, ఒక ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అయితే, ఆయనలో ఆవేశం ఉంది తప్పితే అవగాహన లేదన్నారు. ఆకాశంలో విహరిస్తున్నాడని చెప్పారు.

మనం భూమి మీద ఉన్నామనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. కింద రాయి, రప్ప ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ మద్దతు గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడిందని చెప్పారు.

తాను తన నియోజకవర్గంలో రాజును కాదు, నియంతను కాదన్నారు. ప్రజాప్రతినిధిని అని చెప్పారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

JC Diwakar Reddy comments on Pawan Kalyan

తనకు మంత్రి పదవి రాకపోవడంపైన ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. సీనియార్టీ వల్ల వస్తుందని భావించానని, రాకున్నా పట్టించుకోనని చెప్పారు. సుజనా చౌదరికి, అశోక్ గజపతి రాజుకు వచ్చిందని అసూయపడితే మనం చెడిపోతామన్నారు. వాళ్లు కూడా సీనియర్లు అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకపోవచ్చునని, అయితే ఏపీకి ఆర్థికంగా సాయం మాత్రం అందుతుందని చెప్పారు.

విశాఖ పర్యటనకు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్తారు. అక్కడ మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

అనకాపల్లి మండలం శంఖవరం గ్రామంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. దేశంలోనే తొలి స్వదేశీ తయారీ స్మార్ట్ ఫోన్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విశాఖలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+