బాబును తప్పు పట్టిన జెసి: మంచి కోరిన రోజా
అనంతపురం/ తిరుపతి: రైతు రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడే చంద్రబాబును తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని సమస్యలను చంద్రబాబే కొని తెచ్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు ఉన్నన్ని కష్టాలు మరెవరికీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు. రుణమాఫీ చేసిన తర్వాతే పింఛన్లు పెంచి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తే చాలునని రైతులు ఆశిస్తున్నట్లు తెలిపారు. రుణాల కోసం ప్రస్తుతం ఏ బ్యాంకు అధికారిపై కూడా ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారనేది రైతులకు అవసరం లేదని జెసి అన్నారు. ఏ పార్టీలోనైనా రాజకీయ నేతల మధ్య విభేదాలు సహజమని జెసి దివాకర్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చిత్తూరు జిల్లా నగరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజా సోమవారంనాడు తిరుమల వచ్చారు. ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత ఆమెకు ఆల అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏటా కార్తిక మాసంలో తిరుమల వచ్చి వెంకన్నను దర్శించుకోవడం తాను ఆనవాయితీగా పెట్టుకున్నట్లు రోజా మీడియాతో చెప్పారు. అందులో భాగంగానే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుపడాలని దైవాన్ని కోరుకున్నట్లు రోజా చెప్పారు.












Click it and Unblock the Notifications