'జగన్ జైలుకు వెళ్లక తప్పదు': 2019లో బాబే సీఎం.. జేసీ దివాకర్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశ్యంతో తల్లీపిల్ల కాంగ్రెస్‌లతో పాటు తెరాస ఏకమై రాష్ట్రాన్ని రెండుముక్కలు చేశాయని, దీంతో ఆర్థిక సమస్యలు ఉన్నా రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు.

మాట వినకుంటే హత్యలు, నేను జేసీ బ్రదర్స్ బాధితుడ్నే: వైసిపి నేత వ్యాఖ్యల కలకలం

జగన్ జైలుకు వెళ్లక తప్పదు

జగన్ జైలుకు వెళ్లక తప్పదు

అభివృద్ధిని అడ్డుకుంటూ, ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న జగన్‌కు వెళ్లక తప్పదని ఎమ్మెల్యే అన్నారు. గురువారం పట్టణంలోని కాలేజి సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణదీక్ష ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించారు.

కిక్కిరిసిన ప్రాంగణం

కిక్కిరిసిన ప్రాంగణం

గురువారం పట్టణంలోని కాలేజి సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణదీక్ష ముగింపుసభ భారీ ఎత్తున నిర్వహించారు. జిల్లాలోనే ఎక్కడా లేనివిధంగా భారీగా జనం హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వేలాదిమంది హాజరయ్యారు.

చంద్రబాబు 18 గంటలు కృషి చేస్తున్నారని..

చంద్రబాబు 18 గంటలు కృషి చేస్తున్నారని..

ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోనుగుంట్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు తన రాజకీయ చతురతను ఉపయోగించి రాష్ట్రాభివృద్ధి కోసం 18 గంటల పాటు కృషి చేస్తున్నారన్నారు.

2019లో చంద్రబాబే సీఎం: జేసీ

2019లో చంద్రబాబే సీఎం: జేసీ

2019లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. అందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని చెప్పారు. కాగా, ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు, జెసి పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapur MP JC Diwakar Reddy said that Chandrababu Niadu again will become CM in 2019.
Please Wait while comments are loading...