ఎమ్మెల్యేగా లేకపోవడం సంతోషం, కేసీఆర్‌తో పోటీ వద్దని బాబుకు చెప్పా: జేసీ
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో తాను శాసన సభలో లేకపోవడం సంతోషకరమని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. తిట్టుకోవడం గ్రామాల్లో కనిపిస్తుందని, అసెంబ్లీలో ఉండకూడదని ఆయన అన్నారు. కానీ, విలువలను కాపాడుకుంట ఎంతవరకైనా పోరాడవచ్చన్నారు. సభలో తిట్లు, అసభ్య పదజాలం సరికాదన్నారు.

కొబ్బరి రీజనల్ బోర్డు ఏర్పాటు చేయండి: ఎంపీ తోట
కాకినాడలో కొబ్బరి రీజనల్ బోర్డును ఏర్పాటు చేయాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేశానని ఎంపీ తోట నర్సింహం చెప్పారు. రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయలు త్వరలోనే వస్తాయని, దీనిపై కేంద్రమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. కేంద్రంలో మంత్రి వెంకయ్య నాయుడిది క్రియాశీలక పాత్ర అన్నారు. సమన్వయంతో పని చేసి తాము నిధులు రాబట్టుకుంటామన్నారు.
పెంపు వల్ల 14 శాతం మందిపైనే భారం: చంద్రబాబు
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు వల్ల కేవలం 14 శాతం మందిపైనే భారం పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 8.50 లక్షలమంది ఎస్సీలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.
200 యూనిట్ల వరకు చార్జీల భారం ఉండదని, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను కొనసాగిస్తామన్నారు. వ్యవసాయానుబంధ రంగాలపై పెంపు లేదన్నారు. పొరుగు రాష్ట్రాల కన్నా ఏపీలోనే గృహ విద్యుత్ చార్జీలు తక్కువని చెప్పరారు. విద్యుత్ కొరత లేనందువల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. సోలార్ పంపుసెట్లు, సోలార్ బల్బులు అమరుస్తున్నామన్నారు.
చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోటీ పడవద్దన్నారు. రైతు రుణమాఫీ, 43 శాతం ఫిట్మెంట్ వంటివి సులువైన హామీలు కాదన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి కేసీఆర్ అలా ఇచ్చారని అన్నారు. కేసీఆర్‌తో పోటీ పడొద్దని తాను చంద్రబాబుకు సూటిగా చెప్పానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవచ్చు కానీ, నిధులు కొంతమేర వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications