రెడ్లు జగన్ వెంటే, భార్యాభర్తలు ఇంట్లో ఉన్నా: జేసీ ఆసక్తికరం, పవన్, రకుల్ ప్రీత్‌లు వస్తే అంతే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్లకు విలువ లేకుండా పోతోందని టీడీపీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు.

Recommended Video

    భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా వదలరు : జగన్ పాదయాత్ర పై JC సంచలనం

    అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్లకు విలువ లేకుండా పోతోందని టీడీపీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు.

    చదవండి: పోయేకాలం, తిక్కలోడు: జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు, మంత్రుల పైనా

    ఎంత వద్దనుకున్నా రెడ్లు జగన్ వెంట

    ఎంత వద్దనుకున్నా రెడ్లు జగన్ వెంట

    ఎంత కాదనుకున్నా రెడ్డి కులస్తులు అందరూ జగన్ వెంట వెళ్తున్నారని జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో రెడ్లను ఇతర కులాలకు చెందినవారు గౌరవించడం మానేశారని, రెడ్ల తోకలను కరణం బలరాం లాంటి వాళ్లు కోసేశారని వ్యాఖ్యానించారు.

    అనవసరం, రిటైర్ అవుతా

    అనవసరం, రిటైర్ అవుతా

    ఇక తనకు రాజకీయాలు అనవసరమని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో రిటైర్ అవుతానని వెల్లడించారు. జగన్ పాదయాత్ర వృథా ప్రయాస అన్నారు. ఆయన పాదయాత్ర వల్ల వచ్చేది ఏమీ లేదన్నారు.

    ఇవాళ భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా కెమెరాలు

    ఇవాళ భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా కెమెరాలు

    వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు రోజులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాడు టీవీ ఛానళ్లు చాలా తక్కువగా ఉండేవని, కానీ ఇవాళ భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా వచ్చి కెమెరాలు పెట్టేస్తున్నారని చమత్కరించారు.

    రాజకీయాలు వదిలేసి, వ్యాపారాలు చేసుకో

    రాజకీయాలు వదిలేసి, వ్యాపారాలు చేసుకో

    వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే రోజులు పోయాయని, ఇక అరిగిపోయిన ఆ రికార్డు చెప్పడం మానుకోవాలని జగన్‌కు హితవు పలికారు. ఎలాగూ బాగా సంపాదించాడని, ఇక రాజకీయాలు వదిలేసి పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు.

    చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై జేసీ ఇలా

    చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై జేసీ ఇలా

    చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా జనం వచ్చారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు కూడా వస్తున్నారని జేసీ అన్నారు. రోజా పెట్టినా జనాలు వస్తారని చెప్పారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చినా జనం ఎగబడతారన్నారు. కానీ తాము వచ్చినప్పుడు ఒక్కరూ రారన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+