పోయేకాలం, తిక్కలోడు: జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు, మంత్రుల పైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో పాటు ఏపీ మంత్రులను కూడా ఆయన టార్గెట్ చేయడం గమనార్హం.

జగన్ పాదయాత్ర, ఎన్టీఆర్‌పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు: వరుసగా అలకలు

జగన్‌కు పొద్దున లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించడమే పని అని జేసీ విమర్శించారు. ఒక పార్టీకి నాయకుడిగా ఓట్లు సంపాదించుకోవడంలో తప్పు లేదని, కానీ పదేపదే అర్థం లేని విమర్శలు సరికాదన్నారు.

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాటలా?

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాటలా?

అదే సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జగన్ మాట్లాడటం సరికాదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారని, పల్నాడుకు ఇవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

  YS Jagan Padayatra : కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ | Oneinda Telugu
  జగన్‌కు పోయే కాలం దగ్గరపడింది

  జగన్‌కు పోయే కాలం దగ్గరపడింది

  జగన్‌కు పోయేకాలం దగ్గరపడిందని జేసీ మండిపడ్డారు. పల్నాడుకు నీరు కావాలనే నినాదాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు ద్వారా చెప్పిస్తున్నారన్నారు. ఇది దారుణం అని, సీమకు నీళ్లు ఇవ్వకుండా, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఇంకా దోచి పెట్టాలా అని నిలదీశారు.

  సీఎం పదవి కోసం పుట్టిన గడ్డకు జగన్ అన్యాయం

  సీఎం పదవి కోసం పుట్టిన గడ్డకు జగన్ అన్యాయం

  ఓట్ల కోసం పుట్టిన గడ్డకు కూడా అన్యాయం చేసేందుకు జగన్ వెనుకాడటం లేదని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. జగన్ దృష్టి అంతా ముఖ్యమంత్రి పదవి పైనే ఉందన్నారు. చంద్రబాబు గొప్ప నాయకుడు అని కొనియాడారు. జగన్‌కు పాదయాత్ర అనవసరమని, అతను ఒక తిక్కలోడు అన్నారు. మీడియా ఎక్కడ ఏముందో చెబుతుంటే కొత్తగా పాదయాత్రతో తెలుసుకునేది ఏముందని ప్రశ్నించారు.

  చంద్రబాబుతో ఏకీభవించా

  చంద్రబాబుతో ఏకీభవించా

  తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా పలు విషయాల్లో చంద్రబాబుతో ఏకీభవించానని జేసీ చెప్పారు. తినడానికి తిండి, తాగడానికి నీరు సరిగా లేని అనంతపురం జిల్లాకు నీరు ఇస్తూ సస్యశ్యామలం చేస్తున్నారని, దీనికి అనంత వాసులు ఆయనకు రుణపడి ఉంటారన్నారు.

  ఏపీ మంత్రులపై ఆసక్తికర వ్యాఖ్యలు

  ఏపీ మంత్రులపై ఆసక్తికర వ్యాఖ్యలు

  ఏపీ మంత్రుల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న మంత్రులకు వెన్నెముక లేదన్నారు. మంత్రుల పవర్ తమ టైంతోనే పోయిందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam leader and MP JC Diwakar Reddy on Tuesday responded on YSR Congress Party chief YS Jaganmohan Reddy's padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి