పార్లమెంటు ఎదుటే జేసీ దివాకర్ రెడ్డి వీరంగం: వైసీపీ ఎంపీలపై తొడగొట్టి, మీసం మెలేసి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గురువారం పార్లమెంటు బయట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. వారి వైపు మీద మీదకు వెళ్లారు.

ఏపీ పట్ల సానుభూతి, 2 అంశాలే మిగిలి ఉన్నాయి, మీరు కోరింది కాదు: జైట్లీ షాక్, బాబు కోర్టులోకి బంతి

తొడకొట్టి మీసం మెలేసి వారి పైకి వెళ్లారు. పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల ఆందోళనతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. వారు హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు.

చంద్రబాబు .యూటర్న్

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైసీపీ ఎంపీలు నినాదాలు చేశారు. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది తామేనని వారు వ్యాఖ్యానించారు. హోదా అంటే జైలుకే అని బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.

  YS Jagan Questions why Chandrababu Naidu is continuing in NDA ?

  ప్లకార్డులు పట్టుకొని నిరసన, జేసీ వాగ్వాదం

  ఓ వైపు వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి వారి వైపు దూసుకెళ్లడంతో కొంత కలకలం చెలరేగింది. వారితో ఆయన వాగ్వాదానికి దిగారు.

  మేం రాజీనామా చేస్తున్నాం, మీకు దమ్ముందా

  ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా కేంద్రమంత్రులు రాజీనామా చేస్తున్నారని, దమ్ముంటే మీరు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఆయన వారి మీదమీదకు వెళ్లారు.

   మీసం మెలేసి, తొడ కొట్టి

  మీసం మెలేసి, తొడ కొట్టి

  అప్పుడు అక్కడున్న వైసీపీ ఎంపీలు మీకు ఆ దమ్ము లేదా? అని ప్రశ్నించారు. దీంతో జేసీ తీవ్ర ఆగ్రహంతో వారి మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్లను అక్కడి నుంచి లాగే ప్రయత్నం చేశారు. మీసం మెలేస్తూ, మూతి మీద మీసం ఉంటే ఇప్పుడే రాజీనామాలకు కదలాలని డిమాండ్ చేశారు.

   సవాల్‌కు సిద్ధమన్న వైసీపీ

  సవాల్‌కు సిద్ధమన్న వైసీపీ

  అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడుతూ.. జేసీ దివాకర్ రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, అందరూ కలసి కట్టుగా నేడే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేద్దామంటే తాము అంగీకరిస్తామని కౌంటర్ ఇచ్చారు.

  టీ షర్ట్‌లు ధరించి నిరసన

  మరోవైపు, టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆరు ప్రధాన డిమాండ్లు కలిగిన టీషర్ట్ ధరించారు. ఇది అందరినీ ఆకట్టుకుంది. వారు టీ షర్ట్ దరించడంతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugudesam Party MP JC Diwakar Reddy on Thursday challenged YSR Congress Party MPs over resignations.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి