పిచ్చమ్మ చేతిలోనే: సోనియాపై జెసి, తరిమేస్తారు: టిజి

రాష్ట్రంలో ఏ మూల నుండి అయినా నాలుగు గంటలలో రాజధానికి చేరుకోవచ్చునని చెప్పారు. రాజధాని కోసం పోరాడటమంటే బుద్ధిలేని చర్య అవుతుందన్నారు. పిచ్చమ్మ ఎటు విసిరితే అటే రాజధాని అవుతుందన్నారు. ఇంకోసారి దేనికైనా పోరాటం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఒనగూరే వచ్చినా ప్రయోజనం లేదన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల కోసం నిస్వార్థంగా పని చేశారని కితాబిచ్చారు. ఫైళ్ల కోసమే నాలుగో కృష్ణుడు వస్తున్నాడని ఎద్దేవా చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి పైన సమైక్యవాది అన్న సానుభూతి ఉందని అయితే, అది ఓట్లుగా మారుతుందా లేదా అనేది చూడాలన్నారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా, టిడిపిలోకి లైన్ క్లియర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి విరుచుకుపడటం గమనార్హం.
మళ్లీ తరిమి కొడతారు: టిజి
కోస్తాలో రాజధానిని ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందాక మళ్లీ తమను అక్కడి నుండి తరిమి కొడతారని మంత్రి టిజి వెంకటేష్ కర్నూలులో అన్నారు. ఓట్ల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు జాతి విభజన క్రీడలో తాము ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో మౌనంగా కూర్చోకుండా హక్కుల కోసం పోరాడుదామన్నారు. కర్నూలును రాజధాని చేయకుంటే మరో పోరాటం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications