సీఎం రమేశ్ Vs గల్లా జయదేవ్: చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలైన గల్లా జయదేవ్, సీఎం రమేశ్‌ల మధ్య అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. అయితా తాజాగా ఈ వివాదం తాలుకా పంచాయితీ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వద్దక చేరింది.

రాష్ట్ర విభజన తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో తాను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ చెబుతుండగా, ఆ ఎన్నికను తాము పరిగణలోకి తీసుకోమని తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పడంతో వారిద్దరి మధ్య వివాదం రాజుకుంది.

ఎవరికి వారే ఎన్నికలు నిర్వహించుకున్న రెండు వర్గాలు... తమదే అసలైన ఏపీ ఒలింపిక్ సంఘమంటూ వేర్వేరుగా ప్రకటించుకున్నారు. ఈ విషయమై ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం కనిపించింది. తమకే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ గుర్తింపు ఉందని సీఎం రమేష్ చెబుతుండగా, తమదే అసలైన సంఘం అని గల్లా జయదేవ్ అన్నారు.

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

దీనిపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో రమేశ్, గల్లా వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి రంగప్రవేశం చేసిన ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని మరింత వివాదంగా మార్చేందుకు యత్నిస్తున్నారట.

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం రమేశ్ వర్గానికి చెందిన సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఒలింపిక్ సంఘం గుర్తింపుపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు.

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో గల్లా జయదేవ్ నేతృత్వం వహిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని అసలైన సంఘంగా గుర్తిస్తూ ఐఓఏ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ పవన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

చంద్రబాబు వద్దకు ఏపీ ఒలింపిక్ పంచాయితీ

గల్లా జయదేవ్‌కు అనుకూలంగా ఐఓఏ గతనెల 7న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని, ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ ఒలిపింక్ సంఘాన్ని హైజాక్ చేసేందుకు గల్లా జయదేవ్ కుట్రపన్నారని పవన్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
JC Pavan reddy meet ap cm chandrababu naidu at vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి