అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ 2019: వారసులు బరిలోకి, వైసీపీకి చెక్ పెట్టేలా జెసి ప్లాన్ ఇదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జెసి దివాకర్‌ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. అయితే తన కుమారుడు పవన్‌కుమార్ రెడ్డిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. మరో వైపు జెసి ప్రభాకర్ రెడ్డి తనయుడు తాడిపత్రి నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రభాకర్ రెడ్డి గుంతకల్లు నుండి పోటీ చేయాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టిడిపి గెలుపు బాధ్యతలను తమ భుజాన వేసుకోవాలని జెసి సోదరులు నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో జెసి సోదరులు కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీకి ఏపీ రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2014 ఎన్నికలకు ముందు జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్‌రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు.

అయితే జెసి దివాకర్‌ రెడ్డి అనంతపురం నుండి ఎంపీగా పోటీ చేయగా, తాడిపత్రి నుండి ఆయన సోదరుడు జెసి ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపాలని జెసి సోదరులు భావిస్తున్నారు.

రంగంలోకి పవన్ కుమార్ రెడ్డి

రంగంలోకి పవన్ కుమార్ రెడ్డి

సుదీర్థంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జెసి సోదరులు 2014 ఎన్నికల సమయంలో టిడిపిలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని జెసి దివాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. జెసి దివాకర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా తనయుడు పవన్‌కుమార్ రెడ్డిని రంగంలోకి దింపనున్నారు.

పవన్‌కుమార్ రెడ్డి 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేయనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.మరో వైపు మొత్తం జిల్లా బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకోవాలనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.

తాడిపత్రి నుండి అస్మిత్

తాడిపత్రి నుండి అస్మిత్


తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటరవుతున్నారు.. తాడిపత్రి అసెంబ్లీ నుంచి అస్మిత్‌ను బరిలో దింపే ఆలోచన చేస్తున్నారు.. తమ్ముడు ప్రభాకర్‌రెడ్డిని గుంతకల్లు అభ్యర్థిగా పోటీ పెట్టాలనుకుంటున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.

రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత

రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత


అనంతపురం జిల్లాలో టిడిపికి బిసిలు వెన్నంటి నిలుస్తారని గతంలో చోటు చేసుకొన్న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి కూడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు టిడిపికి నెలకొన్నాయి. వైసీపీకి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.బిసిలకు ప్రాధాన్యతను తగ్గించకుండా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

రాజ్యసభపై జెసి దివాకర్ రెడ్డి కన్ను

రాజ్యసభపై జెసి దివాకర్ రెడ్డి కన్ను

2019 ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలపై జెసి దివాకర్ రెడ్డి కేంద్రీకరించారని అంటున్నారు.ఈ కారణంతోనే జెసి దివాకర్ రెడ్డి తన కొడుకు పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇతర పార్టీల నుంచి వచ్చే వారందరిని చేర్చుకోవాలని టిడిపి భావిస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. జేసీ ఫార్ములా వచ్చే ఎన్నికలలో ఏ మేరకు పని చేస్తుందనేది మాత్రం తేలాలంటే మరో ఏడాదిన్నర వరకు వేచి చూడాల్సిందే.

English summary
Jc Diwakar reddy son Pawan kumar reddy planning to contest from Anantapur Mp seat in 2019 elections.Jc diwakar reddy brothers son Asmit reddy may contest from Tadipatri segment 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X