బాబు సన్నిహితుడే, ఎవరికీ భయపడం: జెసి సోదరుడు

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ మరో పాతికేళ్ల వరకు సీమాంధ్ర ప్రాంతంలో కోలుకునే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలతో తమకు మంచి సంబంధాలున్నాయన్నారు. పార్టీ మారే విషయంలో తాము ఇంకా డైలమాలోనే ఉన్నామని చెప్పారు.
తన సోదరుడు జెసి దివాకర్ రెడ్డికి పార్టీ మారటం ఏమాత్రం ఇష్టం లేదన్నారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే తాము ఎవరికి భయపడమని, ఉన్నది చెప్తామన్నారు. పార్టీ మారే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తాము తీసుకోలేదన్నారు. తమతో టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినప్పటికీ కాంగ్రెసు పార్టీనే ప్రజలు ముద్దాయిగా చూస్తున్నారన్నారు. పార్టీ మారేందుకు తమ అనుచరుల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. తాడిపత్రి నుంచి జెసి దివాకర్ రెడ్డి తనయుడు పవన్ పోటీ చేసే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications