Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి .. అడకత్తెరలో మున్సిపల్ సిబ్బంది

తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య రగడ కొనసాగుతుంది. స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్టు ఇరువురు నేతలు పోటీపడుతున్నారు.మున్సిపల్ చైర్మన్ హోదాలో మున్సిపాలిటీలోపట్టు కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే జెసి ప్రభాకర్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య మున్సిపల్ సిబ్బంది నలిగిపోతున్నారు.

స్థానికంగా పట్టు కోసం జేసీ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

స్థానికంగా పట్టు కోసం జేసీ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

మొన్నటికి మొన్న మున్సిపల్ చైర్మన్ గా తనను దింప లేరని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హాట్ కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ లు కావాలంటే తాను పంపిస్తానని వారిపై అనవసరంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఇక స్థానికంగా పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అడుగడుగునా అడ్డుపడుతున్నారు.

 జేసీ రివ్యూ మీటింగ్ .. ఎమ్మెల్యే ర్యాలీ .. మా వల్ల కాదంటున్న మున్సిపల్ సిబ్బంది

జేసీ రివ్యూ మీటింగ్ .. ఎమ్మెల్యే ర్యాలీ .. మా వల్ల కాదంటున్న మున్సిపల్ సిబ్బంది

తాజాగా మున్సిపల్ సిబ్బందితో జేసీ ప్రభాకర్ రెడ్డి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ కూడా హాజరుకాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులతోనే కరోనా మూడో దశ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. దీంతో అధికారులకు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కాక తప్పలేదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తాడిపత్రి మున్సిపాలిటీలో పరిస్థితి తయారైంది. మున్సిపల్ చైర్మన్ చెప్పింది చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేకు కోపం, ఎమ్మెల్యే చెప్పింది చేస్తే మున్సిపల్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉద్యోగాలు తాము చేయలేము మహాప్రభో అంటూ తాడిపత్రి మునిసిపల్ సిబ్బంది లబోదిబోమంటున్నారు.

 పోటాపోటీగా కార్యక్రమాలతో సిబ్బందికి గందరగోళం

పోటాపోటీగా కార్యక్రమాలతో సిబ్బందికి గందరగోళం

కావాలని ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాలను పెడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారని సమాచారం. ఇద్దరి ఆధిపత్య పోరులో తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మున్సిపల్ కమిషనర్ ఇద్దరి మధ్య కొనసాగుతున్న రగడ నేపద్యంలో సడన్ గా సెలవు పెట్టి వెళ్ళిపోయారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాడిపత్రి మున్సిపాలిటీలో చైర్మన్ గా పట్టు కోసం జెసి ప్రభాకర్ రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యే గా అన్ని తన పరిధిలోనే జరగాలని ప్రయత్నం చేస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది.

ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ కు మధ్య సమన్వయ లేమి.. కారణం ఇదే

ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ కు మధ్య సమన్వయ లేమి.. కారణం ఇదే

సహజంగా మున్సిపల్ సిబ్బంది అటు మున్సిపల్ చైర్మన్ ఆదేశాల మేరకు , అలాగే స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు విధులు నిర్వర్తించాలి. అయితే మున్సిపల్ చైర్మన్ కు , ఎమ్మెల్యే కు మధ్య సమన్వయం ఉండాలి. కానీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కావటం , ఇక మున్సిపల్ చైర్మన్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేత కావటంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే అనేకమార్లు ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున ఘర్షణలకు దిగటం, కేసులు పెట్టుకోవటం వంటి అనేక ఘటనలు వారిద్దరి మధ్య రాజకీయ వైరిని చెప్పకనే చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరికీ చెప్పలేక అధికారులు తీవ్ర అసహనంలో ఉన్నారు.

ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు .. వీరి తీరుతో అధికారులకు తలనొప్పి

ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు .. వీరి తీరుతో అధికారులకు తలనొప్పి

తాడిపత్రి మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి మాట అటుంచి వీరిద్దరిని తట్టుకోవడం ఎలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక తాజాగా తాను నిర్వహించిన సమీక్ష సమావేశానికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేస్తానని వెల్లడించిన జేసీ ప్రభాకర్ రెడ్డి కి సమీక్షకు గైర్హాజరుపై అధికారులు ఏం సమాధానం చెప్తారో తెలియాల్సి ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తన చాంబర్ లోనే ఉండి అధికారుల తీరుపై నిరసన కొనసాగిస్తున్న నేపధ్యంలో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి కలుగుతుంది. ఏది ఏమైనా అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీ మధ్య తాడిపత్రి మున్సిపాలిటీ వేదికగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+