విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ పూజారి: ప్రేయసి భర్త హత్యకు కుట్ర (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పౌరోహిత్యం చేసుకునే అతను.. ప్రేమలో పడ్డాడు.. ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం జరగడంతో ఆమె భర్తను అడ్డుతొలగించి, ఆమెను సొంతం చేసుకోవాలనే దురాలోచనతో కుట్ర పన్నాడు. అంతే తుపాకీ చేతపట్టాడు.. ఏడేళ్లుగా యువతి భర్తను హతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా నిజాన్ని వెల్లడించాడు.

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీకి చెందిన హనుమాచార్యులు కుమారుడు సుదర్శన రవిదత్త, భీమరాజు గుట్టలోని దాసాంజనేయ స్వామి గుడిలో పురోహితుడిగా ఉన్నాడు. తరతరాలుగా పౌరోహిత్యం చేయటంతో వీరి కుటుంబానికి ఇబ్రహీంపట్నంలో మంచిపేరుంది. ఈ నేపథ్యంలో సుదర్శన రవిదత్త గత తొమ్మిదేళ్ల నుంచి సెక్యూరిటీ కాలనీకి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆ యువతికి చెప్పలేదు.

2008లో ఆ యువతికి వివాహమై పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎలాగైనా ఆమె భర్తను అడ్డుతప్పించి.. వివాహాం చేసుకుందామని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆమె భర్తను చంపటానికి ప్రణాళికలు రచించాడు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు లోడ్ చేసుకున్న గన్‌తో చేరుకున్న ఇతను.. అది మిస్‌ఫైర్ అవటంతో పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడు రవిదత్తతోపాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెష్ట్ చేశారు.

నిందితుల నుంచి లైసెన్స్ లేని పిస్టల్‌తోపాటు ఆరు బుల్లెట్లు, ఒక పేల్చిన బుల్లెట్, రెండు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎం. రవిప్రకాష్ తెలిపారు. కాగా, తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడే ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర వెంకటరమణ తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే పని చేస్తున్న శ్రీను, వెంకటయ్యలు పోలీసుల సహాయంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

బుల్లెట్ గాయంతో బాధితుడు

బుల్లెట్ గాయంతో బాధితుడు

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు లోడ్ చేసుకున్న గన్‌తో చేరుకున్న నిందితుడు రవిదత్త.. అది మిస్‌ఫైర్ అవటంతో పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడు రవిదత్తతోపాటు అతనికి సహాయకుడిని పోలీసులు అరెష్ట్ చేశారు. కాగా మిస్ ఫైర్ అయిన బుల్లెట్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర వెంకట రమణ తొడలోకి దూసుకుపోయింది. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

స్వాధీనం చేసుకున్న తుపాకీ, బుల్లెట్లు

స్వాధీనం చేసుకున్న తుపాకీ, బుల్లెట్లు

నిందితుడు రవిదత్త, అతని స్నేహితుడి నుంచి లైసెన్స్ లేని పిస్టల్‌తోపాటు ఆరు బుల్లెట్లు, ఒక పేల్చిన బుల్లెట్, రెండు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎం. రవిప్రకాష్ తెలిపారు.

నిందితుడు ఉపయోగించిన బైక్

నిందితుడు ఉపయోగించిన బైక్

రవిదత్త గత తొమ్మిదేళ్ల నుంచి సెక్యూరిటీ కాలనీకి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆ యువతికి చెప్పలేదు. 2008లో ఆ యువతికి వివాహమై పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎలాగైనా ఆమె భర్తను అడ్డుతప్పించి.. వివాహాం చేసుకుందామని నిర్ణయానికి వచ్చాడు.

నిందితుడు

నిందితుడు

ప్రేయసి భర్తను చంపటానికి ప్రణాళికలు రచించాడు రవిదత్త. ఈ నేపథ్యంలోనే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు లోడ్ చేసుకున్న గన్‌తో చేరుకున్న ఇతను.. అది మిస్‌ఫైర్ అవటంతో పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడు రవిదత్తతోపాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెష్ట్ చేశారు.

పోలీసుల మీడియా సమావేశం

పోలీసుల మీడియా సమావేశం

నిందితులు రవిదత్త, అతని స్నేహితుడి నుంచి లైసెన్స్ లేని పిస్టల్‌తోపాటు ఆరు బుల్లెట్లు, ఒక పేల్చిన బుల్లెట్, రెండు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎం. రవిప్రకాష్ తెలిపారు.

English summary
A jealous priest, who intended to murder the husband of his lover, landed in trouble when the gun he was carrying went off accidentally, critically injuring one at the APSRTC bus station in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X