JEE Advanced ఫలితాలు విడుదల, టాపర్ గా హైదరాబాద్ విద్యార్ధి..!!
ఐఐటీల్లో బీటెక్ సీట్ భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసారు. ఈ నెల 4న జరిగి పరీక్షకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 30 వేల మంది పరీక్షలు రాసారు. ఈ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ కు అర్హత కల్పిస్తారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన చిద్విలాస్ రెడ్డి టాపర్ గా నిలిచారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన చిద్విలాస్ రెడ్డి టాపర్ గా నిలవగా..298 మార్కులతో హైదరాబాద్ జోన్ కు చెందిన నాగ భవ్యశ్రీ బాలికల విభాగంలో ప్రధమ స్థానంలో నిలిచారు. ఈ నెల 19వ తేదీ నుంచి పాసైన వారికి జోసా కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కల్పించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ గువాహటి ఐఐటీ ఇప్పటికే విడుదల చేసింది.

38 రోజులపాటు..మొత్తం ఆరు విడతలుగా కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సారి 30 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేసారు. గత ఏడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉంచారు. ఈ సారి ఈ సీట్లు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications