Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటుకు నోటు: మత్తయ్య చెప్పిన అసలు నిజాలు?.., తెర వెనుక ఇంత జరిగిందా?

Recommended Video

    Cash For Vote Scam : KTR Blackmailed Me Says Mathaiah

    హైదరాబాద్: అప్పట్లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. ఆ తర్వాత మారుతూ వచ్చిన రాజకీయ సమీకరణాల రీత్యా తెరమరుగవుతూ వచ్చింది. రాజకీయాలు అసలు నిందితులను తప్పిస్తే.. మధ్యవర్తిగా ఉన్న తానే దోషిగా ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని నిందితుడు జెరూసలెం మత్తయ్య వాపోతున్నాడు.

    ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పార్టీ ఇన్‌ పర్సన్‌ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరడం గమనార్హం. కోర్టు నుంచి బయటకొచ్చిన అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

     అప్పుడేమో అలా.. ఇప్పుడేమో..:

    అప్పుడేమో అలా.. ఇప్పుడేమో..:

    హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు గంట గంటకు, రోజు రోజుకు వచ్చి అప్‌డేట్స్‌ ఇచ్చినవాళ్లు.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు.

    నాతో మాట్లాడిన ఏపీ టీడీపీ ప్రభుత్వం గానీ, తెలంగాణ పోలీసులు గానీ కేసు గురించి ఏ సమాచారమూ ఇవ్వట్లేదు. హైకోర్టులో కేసు క్వాష్‌ అయ్యేవరకు నాతో ఉన్నవాళ్లు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే కనీసం వాయిదా డేట్ గురించి చెప్పడం లేదు.

     బాబు, కేసీఆర్ ఏకమై?: మత్తయ్య అనుమానం

    బాబు, కేసీఆర్ ఏకమై?: మత్తయ్య అనుమానం

    వారెంట్ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలు పాలయ్యే కుట్ర చేస్తున్నారా? అన్న భయం వెంటాడుతోంది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఏకమై ఇదంతా చేయిస్తున్నారేమోనన్న ఆందోళన ఉంది. అందుకే పార్టీ ఇన్‌ పర్సన్‌గా నేను హాజరై జరిగిన వాస్తవాలన్నీ కోర్టు ముందు పెడుతా, ఆ ఇద్దరి ప్రతీకారాలకు నన్నెలా వాడుకున్నారో వివరిస్తా. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా.

     వాయిదాకు రాకపోతే వారెంట్ ఇష్యూ చేస్తారని..:

    వాయిదాకు రాకపోతే వారెంట్ ఇష్యూ చేస్తారని..:

    ఓటుకు నోటు కేసులో రేవంత్‌ డబ్బులతో పట్టుబడ్డ నాటి నుంచి.. గత 2017 జూన్ వరకు వాళ్ల లాయర్లు నాతో టచ్ లో ఉన్నారు. కానీ గత ఆర్నెళ్ల నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. 23వ తేదీన వాయిదా ఉందని మీడియా ద్వారా తెలుసుకుని ఢిల్లీకి వచ్చా.

    వాయిదాకు రాకపోతే వారెంట్ జారీ అయి ముద్దాయికి శిక్ష పడుతుందని వచ్చాను. కేసులో తటస్థంగా ఉన్నవారి సాక్ష్యం కావాలని చెప్పి నన్ను సాక్షిగా పెట్టారు. అందుకు నేను ఒప్పుకోలేదు. హైకోర్టు కూడా నాకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది.

     అప్పట్లో కేటీఆర్ మనుషులు బెదిరించారు..:

    అప్పట్లో కేటీఆర్ మనుషులు బెదిరించారు..:

    కేటీఆర్ డ్రైవర్, గన్ మెన్ లు ఓసారి ఫోన్ చేసి బెదిరించారు. క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని అన్నారు. పట్టుబడ్డవాళ్లపై కేసు ప్రూవ్ కావాలంటే.. తటస్థంగా ఉన్న నన్ను సాక్షిగా పెట్టాలని చూశారు. అయితే రేవంత్ పట్టుబడ్డ సమయంలో నేను లేను. డబ్బులు ఇచ్చినప్పుడు లేను. నేను లొంగకపోవడంతో నన్ను తిట్టారు.

     ఏపీ పోలీసులు సైలెంట్ అయిపోమన్నారు..:

    ఏపీ పోలీసులు సైలెంట్ అయిపోమన్నారు..:

    విజయవాడ వెళ్లాక కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్‌ ఫోన్ కాల్స్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఏపీ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి తెలంగాణ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. కేవలం వారికి పనికొస్తుందన్న ఉద్దేశంతోనే కేసు పెట్టించుకున్నారు. మరి నన్ను వేధించారు కదా.. దానిపై కేసు పెట్టరా అని ఏపీ పోలీసులను అడిగితే సైలెంట్ అయిపోమని సలహా ఇచ్చారు.

    అప్పు చేసి మరీ వచ్చా:

    అప్పు చేసి మరీ వచ్చా:

    రాజకీయ ప్రయోజనాల రీత్యా టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపాయి. కాబట్టి ఈ కేసులో అసలు నిందితులు పట్టుబడాలంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్ ను కోరినట్టు తెలిపారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే అన్నీ వెలుగులోకి వస్తాయని అన్నారు. కేసుకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చేవారెవరూ లేకపోవడంతో అప్పు చేసి మరీ ఢిల్లీకి వచ్చాను.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+