పెళ్ళాలను మార్చుకోటానికి తప్ప రాజకీయాలకు పనికిరాడు.. పవన్‌పై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం మందడంలో పర్యటన సందర్భంగా ఆయన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు రాజధాని మారుస్తామని జగన్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పినట్లైనా అందరం ఒప్పుకునేవారమని, ఇప్పుడు స్థిరమైన రాజధాని ఉండేదని పవన్ అభిప్రాయపడ్డారు . అధికారం మారితే రాజధాని మారుతుందా? అని పవన్ నిలదీశారు .

రాజధాని రైతులకు మద్దతుగా వైసీపీపై పవన్ నిప్పులు

రాజధాని రైతులకు మద్దతుగా వైసీపీపై పవన్ నిప్పులు

రాయలసీమలో టమాటా రైతులకు ఎలా అయితే అండగా ఉన్నామో .. రాజధాని ప్రాంత రైతులకు కూడా అంతే అండగా ఉంటామని రైతులు ఎవరికీ భయపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు . ప్రజాప్రతినిధుల మాటకు విలువ ఏముంది?. దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు . రాజధాని రైతులకు నేను అండగా ఉంటా. బెదిరింపులకు రైతులు భయపడాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

151 సీట్లు ఇస్తే ఇదేనా ప్రజలకు చేసేది అంటూ ప్రశ్న

151 సీట్లు ఇస్తే ఇదేనా ప్రజలకు చేసేది అంటూ ప్రశ్న

మీరు భూములిచ్చింది ప్రభుత్వానికి రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ. రాష్ట్ర భవిష్యత్‌ కోసం భూములిచ్చిన రైతుల్ని బెదిరిస్తున్నారు అంటూ రైతుల పక్షాన జగన్ ను, అటు వైసీపీ నేతలను ఘాటుగా ప్రశ్నించారు పవన్. 151 సీట్లు ఇస్తే ఇదేనా ప్రజలకు చేసేది అని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ నేపధ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 పెళ్ళాలను మార్చితానికి తప్ప రాజకీయాలకు వేస్ట్ అన్న జోగి రమేష్

పెళ్ళాలను మార్చితానికి తప్ప రాజకీయాలకు వేస్ట్ అన్న జోగి రమేష్

రంగులు మార్చుకోవడానికి, వేషాలు మార్చుకోవడానికి, చివరికి పెళ్లాలను మార్చుకోవడానికి తప్ప రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఎన్నికల్లో గెలవలేని , రెండు చోట్ల పోటీచేసినా గెలవలేని ఈ పిచ్చితుగ్లక్ మాకు చెబుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు . 151 కాదు, అవసరమైతే అంతకంటే ఎక్కువే గెలుస్తాం అంటూ మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు పాలనలో నాలుగేళ్ల పాటు ఏంచేశారు? ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు జోగి రమేష్ .

పవన్ మీద మాటల దాడి చేస్తున్న వైసీపీ నాయకులు

పవన్ మీద మాటల దాడి చేస్తున్న వైసీపీ నాయకులు

ఓ ముల్లు గుచ్చుకుంటే పారిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ పవన్ ను ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలో రైతులను కలుస్తూ పవన్ తమపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నట్టు అర్థమవుతోంది.ఇక జోగి రమేష్ మాత్రమే కాదు వైసీపీ నేతలు మూకుమ్మడిగా పవన్ మీద మాటల దాడి చేస్తున్నారు. పవన్ నిన్నటి దాకా సింగపూర్ లో షూటింగ్ చేశారని.. ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ .మొత్తానికి పవన్ పై వైసీపీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+